మెదడు క్యాన్సర్‌కు జెల్‌తో చికిత్స.. ఇకపై రోగం తిరగబెట్టే సమస్య ఉండదట..!!

-

క్యాన్సర్‌ అంటేనే ప్రమాదకరం..ప్రాణాంతకం.. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఒక్కో క్యాన్సర్‌ది ఒక్కో తీరు. బోన్ క్యాన్సర్‌, స్టమక్‌ క్యాన్సర్, బ్లడ్‌ క్యాన్సర్‌, బ్రస్ట్‌ క్యాన్సర్‌, మెదడు క్యాన్సర్‌ ఇలా చాలా ఉంటాయి. అయితే వీటిల్లో మెదడు క్యాన్సర్‌ ఇంకా డేంజర్‌..శస్త్రచికిత్స చేసి తొలగించినా.. మళ్లీ వస్తుంది. ఏటా ఈ క్యాన్సర్‌ భారిన పడి 25% మంది చనిపోతున్నారని అధ్యయనాలు చెబుతున్నారు. ఇప్పటి వరకూ వైద్యులు కూడా ఈ సమస్యకు చేసేదేమి లేక మళ్లీ మళ్లీ ఆపరేషన్స్‌ చేస్తూ వచ్చారు. అయితే యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ మాడిసన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫార్మసీ పరిశోధకులు మెదడు క్యాన్సర్‌కు ప్రత్యేక జెల్‌ రూపొందించారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే..

మెదడు క్యాన్సర్‌ (గ్లయోబ్లాస్టోమా) 5% మందే ఐదేళ్ల వరకు జీవిస్తుంటారు. మెదడు క్యాన్సర్‌ చికిత్సలో కణితి లేదా గ్లయోమా మూల కణాలను సమూలంగా తీసేయలేకపోవటం పెద్ద సవాల్‌. ఈ కణాలు చాలా ఉద్రిక్తంగా ప్రవరిస్తుంటాయట… చుట్టుపక్కల కణజాలంలోకి తేలికగా, త్వరగా చొచ్చుకెళ్లిపోతాయి. అందువల్ల శస్త్రచికిత్స చేసే సమయంలో కణితి, మామూలు కణజాలం మధ్య సరిహద్దులను స్పష్టంగా గుర్తించటం శస్త్రచికిత్స నిపుణులకు సాధ్యం అయ్యే పని కాదు. మెదడులోని అన్ని కణజాలాలు ముఖ్యమైనవే కావటం వల్ల వీలైనంత ఎక్కువ భాగాన్ని వైద్యులు తొలగించలేరు. ఇదే కణితి మళ్లీ ఏర్పడటానికిది వీలు కల్పిస్తుంది. ఫలితంగా జీవనకాలమూ తగ్గుతుంది.

ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ మాడిసన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫార్మసీ పరిశోధకులు వినూత్న హైడ్రోజెల్‌ను రూపొందించారు. దీన్ని కణితిని తొలగించిన భాగంలోకి ఇంజెక్షన్‌ రూపంలో ఇస్తారు. జిగురుద్రవం రూపంలో ఉండటం వల్ల క్రమంగా మెదడు అంతటా ఇది వ్యాపిస్తుంది. చుట్టుపక్కల కణజాలానికి నెమ్మదిగా మందును విడుదల చేస్తుంది. క్యాన్సర్‌ కణాలను చంపే రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. ఇలా గ్లయోమా మూలకణాలను నిర్మూలిస్తూ క్యాన్సర్‌ తిరగబెట్టటాన్ని నివారిస్తుంది. ఫలితంగా మనిషి జీవనకాలమూ పెరుగుతుంది.

సో..అలా సమస్యను కొంతమేర తగ్గించుకోవచ్చనమాట.. సమస్య వచ్చాక జాగ్రత్తపడేకంటే.. ఎలాంటి రోగాలకు రాకుండా ఉండేదుకే ప్రయత్నించడం ఉత్తమం. ఏ రోగానికి మూలం రోగనిరోధక శక్తి లోపించడం, విపరీతమైన జంక్‌ఫుడ్స్‌ తినడం.. వీటిని క్రమబద్దీకరిస్తే..చాలు ఆరోగ్యవంతమైన జీవితం పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news