మనుషులకు బాగా లేకుంటే ముందుగా ఏదైనా మెడికల్ షాప్ కు వెళ్ళి మందులను తెచ్చుకుంటాము..అలాగే ఓ ఆవు తనకు జబ్బు చెయ్యడం తో తానే స్వయంగా వెళ్ళి మందులు తీసుకున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఆ ఆవు చాలా తెలివైంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.. విషయానికొస్తే.. లంకీ చర్మ వ్యాధి గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పశువులను పట్టి పీడిస్తోంది.
వేల సంఖ్యలో ఆవులు మృత్యువాత పడ్డాయి. రాజస్థాన్ లో కూడా ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఆవుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఓ ఆవు ప్రతి రోజూ మెడికల్ షాప్‌ను విజిట్ చేయడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆవు బాధను అర్థం చేసుకోని మందులు ఇచ్చిన మెడికల్ షాప్ ఓనర్ ను అందరు అభినందిస్తున్నారు..
ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ క్రమంలో మెడికల్ షాపు యజమాని స్పందించారు. ఆవుకు భరించలేని మంట, దురద కలుగుతుందని పేర్కొన్నాడు. నెల రోజుల క్రితం షాపు దగ్గరోలో ఉన్న ఆవు.. ఈ వ్యాధి బారినపడిందని గుర్తించి.. నొప్పి, దురద తగ్గించే మాత్రలను జాంగ్రీలో పెట్టి దానికి అందించినట్టు తెలిపాడు. మాత్రల ప్రభావం వల్ల నొప్పి, దురద నుంచి ఆ ఆవు ఉపశమనం పొందిదని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆ ఆవు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం మెడికల్ షాపుకు వచ్చి మాత్రలను తీసుకుంటుంది.. ప్రస్తుతం దాని ఆరోగ్యం బాగానే ఉందని ఆయన తెలిపారు..
लंपी ग्रषित गाय पहुंची दवाई लेने मेडिकल स्टोर वायरल हुआ वीडियो @DrSatishPoonia @ashokgehlot51 @gssjodhpur @PMOIndia @AmitShah @myogiadityanath @ABPNews @srameshwaram @iampulkitmittal @santprai @pravinyadav pic.twitter.com/jpIyhUri7p
— करनपुरी (@abp_karan) September 14, 2022