ఇయ‌ర్ ఫోన్స్ ను ఎక్కువ‌గా వాడేవారికి ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌..!

-

ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకుని 15 నిమిషాల‌కు మించి వాటితో సౌండ్ వింటే దాంతో వినికిడి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. వినికిడి శ‌క్తి క్ర‌మంగా త‌గ్గిపోయి చివ‌ర‌కు చెవుడు వ‌స్తుంద‌ట‌.

స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చాక చాలా మంది ఇయ‌ర్ ఫోన్స్‌ను వాడ‌డం మొద‌లు పెట్టార‌న్న సంగ‌తి తెలిసిందే. ఫోన్ ఉంటే దాంతోపాటు ఎవ‌రి ద‌గ్గ‌రైనా క‌చ్చితంగా ఇయ‌ర్‌ఫోన్స్ ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌యాణాల్లో ఉన్న‌ప్పుడు లేదా ఖాళీ స‌మ‌యాల్లో చాలా మంది ఇయ‌ర్‌ఫోన్స్ పెట్టుకుని పాట‌లు విన‌డ‌మో, సినిమాలు చూడ‌డ‌మో, గేమ్స్ ఆడ‌డ‌మో చేస్తుంటారు. అయితే నిజానికి ఇయ‌ర్‌ఫోన్స్‌ను అధికంగా వాడ‌కూడ‌ద‌ట‌. అధికంగా వాడితే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు.

ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకుని 15 నిమిషాల‌కు మించి వాటితో సౌండ్ వింటే దాంతో వినికిడి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. వినికిడి శ‌క్తి క్ర‌మంగా త‌గ్గిపోయి చివ‌ర‌కు చెవుడు వ‌స్తుంద‌ట‌. అలాగే మెద‌డు పనితీరు మంద‌గిస్తుంద‌ట‌. యాక్టివ్‌గా ఉండ‌లేర‌ట‌. జ్ఞాప‌క‌శ‌క్తి కూడా త‌గ్గుతుంద‌ట‌. ఇక చాలా మంది ఇయ‌ర్‌ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తుండ‌డం వ‌ల్ల అనేక ప్ర‌మాదాలు కూడా సంభ‌విస్తున్నాయ‌ని, అది చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన వైద్యులు చెబుతున్నారు.

క‌నుక పైన చెప్పిన అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉండాలంటే.. ఇయ‌ర్‌ఫోన్స్‌ను అధికంగా ఉప‌యోగించ‌కూడ‌దు. 15 నిమిషాల క‌న్నా ఎక్కువ సేపు ఇయ‌ర్ ఫోన్స్‌ను వాడ‌రాదు. అలా వాడాల్సి వ‌స్తే మ‌ధ్య మ‌ధ్య‌లో కొంత బ్రేక్ ఇవ్వ‌డం మంచిది. లేదంటే వినికిడి, మెదడుకు సంబంధించిన స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news