నేటి తరుణంలో బరువు తగ్గడం కోసం మనకు అనేక రకాల డైట్‌లు అందుబాటులో ఉన్న విషయం విదితమే. అయితే ఏ డైట్ ను తీసుకున్నా వాటిల్లో కేవలం వెజ్ లేదా నాన్‌వెజ్, లేదా రెండూ కలిపి ఉంటాయి. మరి అసలు ఈ రెండింటిలో ఏది బెటర్ ? వెజిటేరియన్ డైట్‌నే పూర్తిగా పాటించాలా ? లేదా నాన్ వెజ్ డైట్‌ను పాటించాలా ? అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే ఈ రెండింటిలో ఏ డైట్‌ను ఫాలో అయితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ప్రోటీన్లు…
ప్రోటీన్ల విషయానికి వస్తే చికెన్, మటన్, ఫిష్, ఎగ్స్ తదితర ఆహారాల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే శాఖాహారంలో పప్పులు, చిక్కుడు జాతి గింజలు, క్యాబేజీ, కాలిఫ్లవర్ తదితర వాటిల్లో మనకు ప్రోటీన్లు లభిస్తాయి. కనుక వెజ్, నాన్‌వెజ్ ఏది తిన్నా ఫర్వాలేదు. మనకు ప్రోటీన్లు అందుతాయి.
2. విటమిన్ బి12
మన శరీరానికి విటమిన్ బి12 కేవలం మాంసాహారం వల్లే అందుతుంది. కనుక తప్పనసరిగా మాంసాహారం తింటేనే ఈ విటమిన్‌ను పొందవచ్చు. చేపలు, ఎగ్స్, మటన్ ద్వారా మనకు ఈ విటమిన్ లభిస్తుంది. మన శరీరంలో ఎర్ర రక్త కణాలు తయారు కావాలంటే ఐరన్ అవసరం. అయితే ఐరన్‌తోపాటు విటమిన్ బి12 కూడా తగినంతగా ఉంటేనే ఎర్ర రక్త కణాలు తయారవుతాయి. కనుక విటమిన్ బి12 ఉన్న ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. అందుకని ఈ విషయంలో మాంసాహారానికి ఓటేయక తప్పదు.
3. ఫిట్‌నెస్
బాగా వ్యాయామం చేసే వారు ఫిట్‌గా ఉండాలంటే మాంసాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే శీతాకాలంలో మాంసాహారం తినడం వల్ల మన శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. దీంతోపాటు మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ లభిస్తాయి. అందుకని ఫిట్ నెస్ కోసం మాంసాహారం తినాల్సిందే.
4. చురుకుదనం
ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయలు, బాదం, పిస్తా వంటి నట్స్‌తోపాటు చేపలు, ఎగ్స్‌ను తింటే చురుకుదనం పెరుగుతుంది. జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. కనుక ఈ విషయంలో వెజిటేరియన్ ఫుడ్‌కు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. కాబట్టి శాఖాహారం కూడా తినాల్సిందే.
మరి ఇన్ని అంశాలను తెలుసుకున్నాక.. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఏ తరహా డైట్ పాటించాలో..! అవును, కరెక్టే.. వెజ్, నాన్‌వెజ్ రెండు డైట్‌లు మనకు ముఖ్యమే. వారంలో ఈ రెండు రకాల డైట్ ను కచ్చితంగా పాటించాలి. ప్రతి ఒక్కరు తమ అనువును బట్టి రెండు రకాల ఆహారాలను బ్యాలెన్స్‌డ్‌గా తీసుకోవాలి. అప్పుడే మనకు సంపూర్ణ పోషణ అందుతుంది.