బరువు తగ్గాలని మెంటల్‌గా ఫిక్స్ అయినప్పుడు మన పొట్ట కూడా అందుకు సహకరించాలి. ఆకలి వేయకుండా ఉండేవి మనం తినాలి అలా అని ఎక్కువ తినకూడదు అంటే..పోషకాలు ఉన్న లంచ్ చేయాలి. వెయిట్ లాస్ జర్నీలో లంచ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే.. లంచ్‌లో మీరు ఏం తింటున్నారో దాన్ని బట్టే మీకు ఆకలి ఆధారపడుతుంది. బరువు తగ్గాలని కొద్దిగా రైస్ తింటే..తిన్న అరగంట నుంచే ఆకలి మొదలవుతుంది. ఇక ఏదో ఒకటి తింటూ ఉంటాం.. ఈరోజు మనం 5 రకాల క్లాసిక్ పరోటాల గురించి తెలుసుకుందాం. రోజుకో రకం ట్రై చేశారంటే.. మధ్యాహ్నం హెల్తీగా తినొచ్చు, అలాగా మీ బరువు కూడా తగ్గొచ్చు.
మేతీ పరోఠా :
ఇది రుచికరమైనది మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది. మెంతి ఆకులు ఆరోగ్యానికి చాలా మంచివి. దీన్ని తినడానికి పెరుగు, చట్నీ ఉపయోగించవచ్చు. ఇది రుచిని మరింత పెంచుతుంది.
బీట్‌రూట్ పరోటా– బీట్‌రూట్ మన ఆరోగ్యానికి వివిధ రకాలుగా ఉపయోగపడే పోషకాలతో నిండి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీట్‌రూట్ పరోటా తయారు చేసుకోవచ్చు. మీరు దీన్ని ఇతర పరోటాల మాదిరిగా చేసుకోవచ్చు, కానీ మీరు బీట్‌రూట్‌ను జోడించినట్లయితే, మీకు రుచికరమైన బీట్‌రూట్ పరోటా లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిది మరియు రక్త శుద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
పాలక్ పరోటా- పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. పాలకూరతో పరోటా చేసుకుని తింటే.. మీకు ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఇది జీర్ణశక్తికి కూడా మంచిది.
ముల్లంగి పరోటా- ముల్లంగిలో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మంచిది. మలబద్ధకం ఉన్నవారికి సహాయపడుతుందని పరిశోధనలో తేలింది. దీంతో పరోటా చేసుకుని తింటే.. మీకు మధ్యాహ్నం ఫుల్ మీల్స్ రెడీ.! కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. త్వరగా ఆకలి వేయదు కాబట్టి మీరు ఏం తినకుండా ఉండొచ్చు.
మస్టర్డ్ గ్రీన్ పరోటా- మీరు అలసిపోయినట్లయితే, ఆవాలు పచ్చి పరోటా మీ ఆహారాన్ని తాజాగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
వారం రోజుల పాటు మధ్యాహ్నం ఈ పరోటాలనే తింటే మీ బరువులో గణనీయమైన మార్పులు చూస్తారు. బరువు తగ్గాలనుకోవడం లేదు నేను ఎందుకు తినాలి అనుకుంటారామో..! సన్నగా ఉన్నవాళ్లైనా.. వీటని అప్పుడప్పుడు తింటే.. ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.