వాకింగ్ వ‌ల్ల త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గాలంటే ఇలా చేయాలి..!

-

వాకింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. వాకింగ్ వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. శారీర‌క దృఢ‌త్వం ఏర్ప‌డుతుంది. ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగు ప‌డి గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే రోజుకు కొద్ది సేపు వాకింగ్ చేస్తే చాలు క‌దా.. అని సింపుల్‌గా అలా వాకింగ్‌కు వెళ్లి ఇలా వ‌స్తుంటారు. కానీ అలా కాదు, వాకింగ్ చేయ‌డానికి కూడా ప‌లు నియ‌మాలు ఉన్నాయి. వాటిని పాటిస్తేనే అనుకున్న ఫ‌లితాల‌ను సాధించ‌వ‌చ్చు.

want to reduce weight quickly by walking do this

వాకింగ్ చేసేవారు క‌చ్చితంగా 10వేల నుంచి 15వేల స్టెప్స్ న‌డ‌వాలి. అన్ని స్టెప్స్‌ను ఎలా కౌంట్ చేస్తాం అనుకునేవారు ఫోన్ల‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. వాటిల్లో పెడోమీట‌ర్ యాప్స్ ల‌భిస్తున్నాయి. వాటిని ఇన్‌స్టాల్ చేసుకుని వాడితే చాలు. అవి 100 శాతం క‌చ్చితత్వంతో ప‌నిచేయ‌క‌పోయినా ఒక మోస్త‌రుగానైనా మ‌నం న‌డిచిన స్టెప్స్‌ను లెక్కిస్తాయి. దీంతో రోజుకు 10వేల నుంచి 15వేల స్టెప్స్ కోటాను సుల‌భంగా పూర్తి చేయ‌వ‌చ్చు.

ఒకేసారి 10వేల స్టెప్స్‌ను పూర్తి చేయ‌లేమ‌నుకుంటే ఉద‌యం, సాయంత్రం వాకింగ్ ద్వారా 5వేల స్టెప్స్ న‌డ‌వ‌చ్చు. ఈ విధంగా కూడా స్టెప్స్ కోటా పూర్తి చేయ‌వ‌చ్చు. దీంతో శ‌రీరంపై కూడా ఒకేసారి అధిక భారం ప‌డ‌కుండా ఉంటుంది.

వాకింగ్ అయినా స‌రే స‌రైన దుస్తుల‌ను ధ‌రించాలి. ట్రాక్‌సూట్ లేదా వ‌దులైన దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది. అలాగే పాదాల‌కు షూస్ ధ‌రిస్తే మంచిది.

వాకింగ్ చేసేవారు ఒకే స్పీడ్‌తో న‌డ‌వ‌కూడ‌దు. 20 నిమిషాల పాటు సాధార‌ణ స్పీడ్‌తో, మ‌రో 20 నిమిషాలు వేగంగా.. ఇలా స్పీడ్‌ను మారుస్తూ న‌డ‌వాలి. దీంతో 20 శాతం క్యాల‌రీలు ఎక్కువ‌గా ఖ‌ర్చ‌వుతాయి.

వాకింగ్ చేసేవారు అవ‌స‌రం అనుకుంటే చేత్తో డంబెల్స్ లాంటి బ‌రువుల‌ను మోస్తూ వాకింగ్ చేయ‌వ‌చ్చు. దీంతో మ‌రిన్ని ఎక్కువ క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయి.

స‌మ‌త‌లంగా ఉండే ప్ర‌దేశంలో కాకుండా ఎత్తు ఒంపులు ఉండే ప్ర‌దేశాల్లో వాకింగ్ చేస్తే ఇంకా ఎక్కువ క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయి.

వాకింగ్ చేయ‌డం వ‌ల్ల చెమ‌ట ఎక్కువ‌గా వ‌చ్చి నీరు బ‌య‌ట‌కు పోతుంది. అందువ‌ల్ల నీటిని ఎక్కువ‌గా తాగాలి. అలాగే చ‌క్కెర లేకుండా గ్రీన్ టీ, హెర్బ‌ల్ టీలు తాగ‌వ‌చ్చు. చ‌క్కెరను పూర్తిగా మానేయాలి. లేదా త‌గ్గించాలి.

ఈ విధంగా వాకింగ్ చేస్తే సాధార‌ణ వాకింగ్‌క‌న్నా ఎక్కువ ఫ‌లితాన్ని త‌క్కువ స‌మ‌యంలోనే పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news