నాన్‌వెజ్ పూర్తిగా మానేసి కేవలం వెజ్ ఆహారాలనే తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు సరిగ్గా అందుతాయి.
మన దేశంలో వెజ్, నాన్ వెజ్.. రెండు రకాల ఆహార పదార్థాలు తినే వారున్నారు. అందులో భాగంగానే ఎవరైనా.. రోజూ తమకు నచ్చిన ఆహారాలను లాగించేస్తుంటారు. కొందరు వారానికి ఒకసారో, రెండు సార్లో నాన్‌వెజ్ తింటే.. ఇంకా కొందరికైతే రోజూ నాన్ వెజ్ తిననది ముద్ద దిగదు. ఇక కొందరు కేవలం వెజ్ మాత్రమే తింటుంటారు. అయితే నాన్‌వెజ్ తినేవారు పూర్తిగా దాన్ని మానేసి శాకాహారులుగా మారితే మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
1. నాన్‌వెజ్ తినడం పూర్తిగా మానేస్తే మన శరీరంలో ఉన్న వాపులు తగ్గుతాయి. దీంతో శరీరంలో ఉండే విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. డయాబెటిస్, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు రాకుండా ఉంటాయి.
2. రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
3. లివర్, జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని వల్ల హానికరమైన బాక్టీరియా, వైరస్‌లు నాశనమవుతాయి.
4. డీఎన్ఏలో మార్పులు వస్తాయి. క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు మెరుగ్గా పనిచేస్తాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
5. నాన్‌వెజ్ పూర్తిగా మానేసి కేవలం వెజ్ ఆహారాలనే తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు సరిగ్గా అందుతాయి.