చాలా మంది నోట డయాలిసిస్ అనే మాట వినే ఉంటాం. అయితే అసలు డయాలసిస్ అంటే ఏమిటి…?, ఇది ఎప్పుడు అవసరం అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. రెండు కిడ్నీలు పని చేయడం ఆపివేసినప్పుడు… వాటిని కృత్రిమమముగా పని చేయించే విధానాన్ని డయాలసిస్ అంటారు. అయితే ఈ డయాలసిస్ చేసేటప్పుడు ఎలాంటి పనులు జరుగుతాయి అనేది చూస్తే..
- డయాలసిస్ చేస్తే క్రియాటినిన్, యూరియా లాంటి వ్యర్థ ఉత్పత్తులను రక్తం లో నుంచి వేరు చేసి శుద్ధి పరచడం జరుగుతుంది.
- అలానే పొటాషియం, సోడియం లాంటి ఖనిజాలను శరీరంలో తగిన మోతాదులో ఉంచుతుంది.
- శరీరములో నుంచి అధిక నీటిని తీసివేసి తగిన మోతాదులో నీరు నిలువ ఉండేలా చూసుకుంటుంది.
- శరీరంలో వుండే అధిక యాసిడ్స్ ని తగ్గించి తగిన స్థాయిలో ఉండేలా చేస్తుంది.
ఇక డయాలసిస్ ఎప్పడు అవసరం పడుతుంది అనే విషయానికి వస్తే..
కిడ్నీల పని తీరు తగ్గడం కిడ్నీ ఫెయిల్యూర్ అవడం లేదా ఒకవేళ కిడ్నీలు మొత్తంగా పని చేయక పోయినా కానీ అవసరం అవుతుంది. సీరం క్రియాటినిన్ 8–10 మీ.గ్రా. కంటే అధికముగా ఉంటే డయాలసిస్ చేయించాలి.
కృత్రిమ కిడ్నీలలో రక్తం శుద్దీకరణము మెషీన్ ద్వారా ఒక పత్యేకమైన మందు సహాయముతో అవుతుంది.
డయాలసిస్ ప్రక్రియలో శుద్ధి చేయబడిన రక్తము మళ్ళీ శరీరములోనికి పంపడం జరుగుతుంది.
హిమోడయాలసిస్ మెషీన్ లోపల ఉన్న సిస్ట్ పంప్ సహాయముతో శరీరములో నుంచి 250-300 మిల్లీ గ్రాముల రక్తమును ప్రతి నిముషానికి శుద్ధి చేయడానికి ఆర్టిఫిషల్ కిడ్నీస్ లోకి పంపబడుతుంది.
బ్లడ్ గట్టి పడకుండా హెపరీన్ ని వాడుతారు.
kidneys : ఆరోగ్యంవంతమైన కిడ్నీల కోసం
- కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్ధాలు
- కిడ్నీలో రాళ్ళని ఇలా తొలగించచ్చు
- ఈ లక్షణాలుంటే ” కిడ్నీ సమస్యలు ” కావొచ్చు చెక్ చేసుకోండి