నిరుద్యోగులకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థలో ఉన్న ఖాళీలు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తాజాగా BEL బీఈఎల్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. 50 అప్రెంటీషిప్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 29ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని job notification నోటిఫికేషన్లో సూచించారు.

బీఈఎల్‌లో ఉద్యోగాల ఖాళీల వివరాలు..
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- మెకానికల్ విభాగంలో 20, కంప్యూటర్ సైన్స్ –10, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ –10, సివిల్ ఇంజినీరింగ్ – 10 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు.
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 11, 110 స్కాలర్ షిప్ గా అందించనున్నారు. దీనికి బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు ఏఐసీటీఈ లేదా భారత ప్రభుత్వం చే గుర్తింపు పొందిన సంస్థ నుంచి 2018 నవంబర్ 30లోగా ఈ డిగ్రీ చేసిన వారు అర్హులు.
- అభ్యర్థుల వయస్సు 2021 నవంబర్ 30లోగా 25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంది.
- అధికారిక వెబ్ సైట్: https://bel&india.in/Default.aspx