బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్న‌ర్‌ల‌ను రోజులో ఏ స‌మ‌యంలో చేయాలో తెలుసా..?

-

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌… మ‌ధ్యాహ్నం లంచ్‌.. రాత్రి డిన్న‌ర్‌… ఈ మూడింటినీ మ‌నం క‌రెక్టు టైముకు పూర్తి చేయాలి. ఆహారం తీసుకునే విష‌యంలో క‌చ్చితంగా స‌మ‌య పాల‌న పాటించాలి.

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌… మ‌ధ్యాహ్నం లంచ్‌.. రాత్రి డిన్న‌ర్‌… ఈ మూడింటినీ మ‌నం క‌రెక్టు టైముకు పూర్తి చేయాలి. ఆహారం తీసుకునే విష‌యంలో క‌చ్చితంగా స‌మ‌య పాల‌న పాటించాలి. రోజూ ఆ మూడు ఆహారాల‌ను ఏ టైముకు తీసుకుంటామో ఆ టైం నిర్దిష్టంగా ఉండాలి. స‌మ‌యం మించ‌కూడ‌దు. అందుక‌నే వైద్యులు కూడా వేళ‌కు భోజ‌నం చేయాల‌ని మ‌న‌కు చెబుతుంటారు. అయితే అస‌లు బ్రేక్ ఫాస్ట్‌, లంచ్‌, డిన్న‌ర్‌ల‌ను రోజులో ఏ స‌మ‌యంలో చేయాలో.. ఎప్పటి వ‌ర‌కు వాటిని తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందామా..!

బ్రేక్‌ఫాస్ట్‌…

ఉద‌యం 7 నుంచి 8 గంట‌ల మ‌ధ్యే బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేయాలి. నిద్ర లేచిన క‌నీసం 30 నుంచి 60 నిమిషాల్లోగా బ్రేక్‌ఫాస్ట్‌ను పూర్తి చేస్తే మంచిది. ఇక ఉద‌యం 10 దాటాక బ్రేక్‌ఫాస్ట్ చేయ‌రాదు. ఏదైనా స్నాక్స్ తిని నేరుగా మ‌ధ్యాహ్నం లంచ్ చేయాలి.

లంచ్‌…

మ‌ధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల మ‌ధ్యే లంచ్ ఫినిష్ చేయాలి. మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల త‌రువాత లంచ్ చేయ‌రాదు. అయితే ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్, మ‌ధ్యాహ్నం లంచ్ టైముల మ‌ధ్య క‌నీసం 4 గంట‌ల వ్య‌వ‌ధి ఉండేలా చూసుకోవాలి.

what is the right time to eat breakfast lunch and dinner

డిన్న‌ర్‌…

సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంట‌ల లోపే డిన్న‌ర్ ముగించాలి. రాత్రి 10 దాటాక ఎట్టి ప‌రిస్థితిలోనూ భోజ‌నం చేయ‌కూడ‌దు. ఇక రాత్రి భోజ‌నం చేశాక క‌నీసం 4 గంట‌లు ఆగాకే నిద్రకు ఉప‌క్ర‌మించాలి. ఆ విధంగా రాత్రి డిన్న‌ర్ ప్లాన్ చేసుకోవాలి. ఈ విధంగా నిత్యం టైముకు భోజ‌నం చేస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news