తినడం మానేస్తే బరువు తగ్గడానికి అవుతుందా…?

చాలామంది బరువు తగ్గాలంటే తినడం మానేయాలి అని అనుకుంటూ ఉంటారు. పైగా కొన్ని మీల్స్ ని కూడా స్కిప్ చేస్తూ ఉంటారు. అయితే నిపుణులు చెబుతున్న దాని ప్రకారం అన్ని సార్లు కూడా తినడం మానేస్తే బరువు తగ్గరు. అయితే మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. బరువు తగ్గాలంటే రోజువారీ తీసుకునే ఆహారంలో కేలరీలను తగ్గించుకుంటూ ఉంటారు. దీని కారణంగా బరువు తగ్గవచ్చు అనుకుంటారు. అయితే నిజంగా తినకపోవడం వల్ల బరువు తగ్గవచ్చు, తగ్గకపోవచ్చు.

 

weight loss

ఒబిసిటీ అనేది ఒక కాంప్లెక్స్ కండిషన్. కొంతమంది జీన్స్ కారణంగా బరువు పెరిగిపోతారు. అలాగే వ్యాయామం, డైట్, ఒత్తిడి, నిద్ర ఇవన్నీ కూడా మన పైన ఎఫెక్ట్స్ చూపిస్తాయి.

మీల్స్ ని స్కిప్ చేస్తే ఏమవుతుంది…?

మనం తినడం మానేస్తే క్యాలరీలు తగ్గుతాయి. అయితే ఇవి అన్నీ కూడ వచ్చే అవకాశం వుంది.
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాల ముఖ్యం గుర్తు పెట్టుకోండి.
ఆకలి పెరిగినప్పుడు ఎక్కువగా ఆహారం తీసుకోవడం జరుగుతుంది.
ఎనర్జీని తక్కువ ఖర్చు చేసినప్పుడు బద్ధకంగా అనిపించడం కూడ వుంటుంది.
మెటబాలిజం తగ్గిపోవడం వల్ల తక్కువ ఎనర్జీ ఖర్చవుతుంది.
పోషకాహార లోపం కలగడం.
యాసిడిటీ, యాసిడ్ రెఫ్లక్స్, బ్లడ్ షుగర్ లెవెల్స్ లో మార్పు వంటివి కలగడం లాంటివి జరుగుతాయి.
అలానే నీరసం, కన్ఫ్యూషన్, ఇరిటేషన్ లాంటివి కూడా అనిపిస్తూ ఉంటాయి.
కార్టిసోల్ ఎక్కువైపోవడం వలన ఆకలి పెరిగి పోతుంది. ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది.

మీల్స్ ని స్కిప్ చేయడం వల్ల బరువు తగ్గొచ్చు:

మనం ఆహారాన్ని తీసుకోవడం మానేసినప్పుడు బరువు తగ్గడానికి కూడా అవుతుంది. ఎందుకంటే తక్కువ క్యాలరీలు అందుతాయి. అయితే ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటే బరువును మెయింటైన్ చేయొచ్చు. అయితే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే సమస్యలు వస్తాయి. ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు అనేది ఎంత ముఖ్యమో ఎంత క్వాలిటీ ఫుడ్ తీసుకుంటున్నారనేది కూడ అంతే ముఖ్యం.