తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తాజా మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7 గా నమోదు అయింది.
అయితే.. ఇవాళ నమోదైన నాలుగు కేసుల్లో… ముగ్గురు కెన్యా దేశానికి చెందిన వారని… మరొకరు ఇండియాకు చెందిన వ్యక్తి అని… వైద్య అధికారులు చెప్పారు. . అయితే.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరగడంతో.. తెలంగాణ ఆరోగ్య శాఖ అలెర్ట్ అయింది.
కాగా… ఈ ఒమిక్రాన్ వేరియంట్… దక్షిణా ఫ్రికా దేశంలో పురుడు పోసుకున్నసంగతి తెలిసిందే. అయితే.. ఈ కొత్త వేరియంట్ క్రమంగా.. 70 కి పైగా దేశాలకు చేరింది ఈ కొత్త వేరియంట్. ఇక ఇండియా మొట్ట మొదటి ఒమిక్రాన్ కేసు… కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది. క్రమంగా.. ఈ కేసులు సగం రాష్ట్రలకు చేరాయి. కాగా.. ఈ కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా.. ఇప్పటి వరకు యూకే లో ఒకరు మరణించారు.