స్లిమ్ అవ్వాలనుకునే వాళ్ళందరూ రాత్రిపూట ఈ పనులు చేస్తే చాలు..

-

చూడడానికి సన్నగా, నాజూగ్గా కనిపించాలని అందరికీ ఉంటుంది. పొట్ట బయటకు వస్తున్న కొద్దీ స్లిమ్ గా అయితే బాగుండు అన్న ఆలోచనలు పెరుగుతుంటాయి. కానీ ఎంత ప్రయత్నించినా సన్నగా మారని వాళ్ళు చాలా ఉన్నారు. దీనికి చాలా కారణాలుండవచ్చు. ఐతే మీరు సన్నగా మారాలనుకుంటున్నారా? దానికోసం రాత్రిపూట కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అవేంటో ఇక్కడ చూద్దాం.

7గంటల తర్వాత ఆహారం ముట్టుకోవద్దు

రాత్రి 7గంటల తర్వాత తినడం తాగడం మానేయండి. దాహం వేస్తే మంచినీళ్ళు తప్ప మరో ఆహారం ముట్టుకోవద్దు. రాత్రిపూట తినే ఆహారం కొవ్వు పేరుకునేలా చేస్తుంది.

టీ కాఫీ అసలే వద్దు

నిద్రపోయే ముందు టీ కాఫీ తాగడం వల్ల జీవక్రియ ప్రభావితం అవుతుంది. అదీగాక నిద్ర దూరం అవుతుంది. కాబట్టి పడుకునే ముందు టీ అస్సలు వద్దు.

భోజనం తర్వాత వ్యాయామం అసలే వద్దు

రాత్రి తిన్న తర్వాత వ్యాయామం చేసే వారు కొందరుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉంటుంది.

నిద్రపోయే ముందు తాగునీళ్ళు ముట్టుకోవద్దు

ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. నీళ్ళు తాగినా జీవక్రియ పని చేయాల్సి ఉంటుంది. నిద్రలో దానికి విశ్రాంతి ఇవ్వాలి. అందుకోసం కొంచెం కడుపు ఖాళీగా ఉంచుకుంటే బెటర్.

పిండి పదార్థాలు, ప్రోటీన్ పక్కన పెట్టండి

ఈ రెండింటి వల్ల కొవ్వు పెరిగే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా ప్రోటీన్ వల్ల గ్యాస్ పెరిగే చాన్స్ ఉంటుంది. అందుకే రాత్రిపూట వీటిని ముట్టుకోవద్దు. తేలికపాటి పండ్లు, కూరగాయలు తీసుకుంటే చాలు.

Read more RELATED
Recommended to you

Latest news