ఈరోజు ఏ రాశి వాళ్లు అద్భుతాలను చూస్తారో తెలుసా?

-

మే 13న ఏ రాశి వారికి బాగా కలిసి వస్తుందో ఇప్పుడు చుద్దాము..

మేషం

వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు..వాహన యోగం ఉంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది.. దైవదర్శనాలు. విందు వినోదాల్లో పాల్గొంటారు..ఈరోజు చాలా మంచి రోజు.

వృషభం

ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది..ఈరోజు చేస్తున్న పని పై శ్రద్ద వహించాలి..కాస్త ఆలొచించి నిర్ణయాలను తీసుకోవడం మంచిది.

మిథునం

వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధ సేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు..మిత్రులతో మాటలు పడతారు.కొంత చికాకులు కలుగుతాయి.. జాగ్రత్త వహించాలి.

కర్కాటకం

ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి..కొన్ని విషయాలు అందరితో పంచుకోవడం మంచిది కాదు..గమనించుకోవాలి..

సింహం

విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం..ఏది అనుకున్న అది వెనక్కి వెళుతుంది..జాగ్రత్త వహించాలి..

కన్య

కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు..అయిన వారితో మాట పట్టింపులు కూడా ఉంటాయి.

తుల

రుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి..కుటుంబంలో చికాకులు వుంటాయి..సానుకూలంగా పరిష్కరించాలి..

వృశ్చికం

వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి..దైవదర్శనాలు చేస్తారు..అనుకోని ప్రయాణాలు.చాలా మంచి రోజు..అనుకున్న ఫలితాలు వస్తాయి.

ధనుస్సు

శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.అనుకొని విధంగా శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి. ఉద్యోగాలలో కూడా మంచి ఫలితాలు కలుగుతాయి.

మకరం

అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు గందరగోళంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలోనివారు జాగ్రత్తగా ఉండటం మంచిది. స్త్రీలు పిల్లలపట్ల మరింత శ్రద్ధ వహిస్తారు..విందు,వినొదాలలో పాల్గొంటారు..

కుంభం

అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు.సోదరులతో చికాకులు కలుగుతాయి.. ఈరోజు అంత మంచి రోజు కాదు.ఇష్ట దైవాన్ని ప్రార్దించాలి.

మీనం

ఫారిన్ కు వెళ్ళాలని అనుకోనేవారికి ఈరోజు మంచి రోజు వారి ప్రయత్నం ఫలిస్తుంది..ఆరోగ్యం పై శ్రద్ద వహించాలి.వచ్చే ఆదాయం కన్నా కూడా వచ్చే ఆర్థిక వ్యయం అధికం.బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు..దైవదర్శనాలు చేయడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news