ఈ రాశి వారికి ఈరోజు అన్నీట్లో విజయాలే కలుగుతాయి..

-

మే 18 న రాశి ఫలాలు..ఏ రాశి వారికి అన్నీట్లో విజయాలు కలుగుతాయి మొదలగు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మేషం:

ఈ రోజు మొదలు పెట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో కలహాలు. అనారోగ్య సూచనలు. బంధువుల తాకిడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనంగా ఉంటాయి.బంధువులతో చికాకులు..

వృషభం:

మిత్రుల ప్రోద్బలంతో పనులు పూర్తి చేస్తారు.మొండి బకాయిలు తీరతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు,ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.విందు కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిథునం:

పనులు చకచకా సాగుతాయి. ఆప్తులు దగ్గరవుతారు. దైవకార్యాలు చేపడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు..ఈరోజు చాలా మంచి రోజు.

కర్కాటకం:

ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. మీ ఆలోచనలు స్థిరంగా సాగవు. దూరప్రయాణాలు. ఆస్తులు విషయంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు..ఆర్థిక ఫలిథాలు కొంతవరకూ ఇబ్బంది పెడతాయి.

సింహం:

ఎంత కష్టపడ్డా ఆశించిన ఫలితం దక్కదు. బంధువర్గంతో తగాదాలు. ఆరోగ్యభంగం. ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు..కుటుంబంలో కూడా అనుకొని చికాకులు..

కన్య:

సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సమాజంలో గౌరవం. కీలక నిర్ణయాలు, ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి..శుభ కార్యక్రమాలు చేస్తారు..ముఖ్యమైన వారి దగ్గర నుంచి మంచి వార్తలు వింటారు.

తుల:

రుణబాధలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.ఎ పని మొదలు పెట్టిన ఆటంకాలు. ఈరోజు ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

వృశ్చికం:

ఆర్థిక విషయాలలో పురోగతి. సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ లను ఈరోజు వింటారు.ఈరోజు చాలా మంచి రోజు..

ధనుస్సు:

సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి..ముఖ్యమైన పనులలో జాప్యం. కుటుంబంలో అనుకొని ఘర్షణలు..

మకరం:

పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. సంఘంలో ఆదరణ పొందుతారు. వస్తులాభాలు. వ్యాపారాలు , ఉద్యోగాలలో పురోభివృద్ధి. నూతన ఫలితాలు మెరుగ్గా వుంటాయి.

కుంభం:

కొత్త పరిచయాలు. సేవభావం పెరుగుతుంది. సన్నిహితులతో మనస్పర్థలు. ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి..ఈరోజు అంతా చాలా సంతోషంగా ఉంటారు.

మీనం:

వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చాలా మంచిది..ఈరోజు ప్రశాంతంగా వుండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు..

Read more RELATED
Recommended to you

Latest news