నవంబర్ 28 శనివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

Join Our COmmunity

 

నవంబర్‌-28-కార్తీకమాసం- శనివారం.

మేషరాశి:ఈరోజు తగాదాలకు దూరంగా ఉండండి !

ఈరోజు మిశ్రమఫలితాలు. ఈరోజు మీకు కొంత కష్టంగా గడుస్తుంది. కటుంబ సభ్యుల ప్రవర్తన కారణంగా మీరు కొంచం అసంతృప్తికి గురి అవుతారు. తగాదాలకు దూరంగా ఉంటె మంచిది. ఈరోజు ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

పరిహారాలుః శ్రీకార్తీకదామోదర స్వామి నామస్మరణ చేయండి.

 

todays horoscope

వృషభరాశి:ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు !

ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఈరోజు దేవాలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువాలి.

 

మిధునరాశి:ఈ రోజు పనుల్లో విజయం !

ఈరోజు అనుకూల ఫలితాలు. ఈ రోజు అనుకున్న పనుల్లో విజయం. శుభవార్తలు. ధన, వస్తులాభాలు. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. గోచారరీత్యా అష్టమ శని ప్రభావంతో ఉన్నారు.

పరిహారాలుః శ్రీశివాభిషేకం చేయండి, అనుకూల ఫలితాలు వస్తాయి.

 

కర్కాటకరాశి:ఈరోజు ఆస్తిలాభం కలుగవచ్చు !

ఈ రోజు అనుకున్న పనుల్లో మరింత పురోగతి. సంఘంలో గౌరవం. ఈరోజు ఆస్తిలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

 

సింహరాశి:ఈరోజు మిశ్రమ ఫలితాలు !

ఈరోజు మిశ్రమ ఫలితాలు. ఈ రోజు దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఈరోజు పని వత్తిడి, శ్రమ పెరుగుతుంది. అనారోగ్యం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ. తొందరపాటు నిర్ణయాలు వద్దు.

వైవాహిక జీవితంలో సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రదక్షణ, దీపారాధన చేయండి.

 

కన్యారాశి:ఈ రోజు ఆదాయానికి మించి ఖర్చులు !

ఈ రోజు ఆదాయానికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. ఆకస్మిక ప్రయాణాలు. దేవాలయ సందర్శనానికి అవకాశం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. కళాకారులకు చికాకులు. పిల్లలు మీకు సంతోషాన్ని కలిగిస్తారు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

 

తులారాశి:ఈరోజు ఈరాశి వారికి కార్యసిద్ధి !

ఈ రోజు చేసే పనులలో కార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. బంధువులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. వాహనయోగం. సంతానం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు, వైవాహిక జీవితంలో ఆనందం.

పరిహారాలుః అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పఠించాలి.

వృశ్చికరాశి:ఈరోజు పనుల్లో కార్యజయం !

ఈ రోజు  విద్యార్థులకు విజయానికి సంబంధించిన సమాచారం అందుతుంది. ఈరోజు చేసే పనుల్లో కార్యజయం. పెద్దల నుంచి సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

పరిహారాలుః శ్రీవేంకటేశ్వరస్వామి దగ్గర దీపారాధన చేయండి.

 

ధనుస్సురాశి :ఈరోజు వ్యాపారాలు అంతగా సాగవు !

ఈరోజు అనుకోని ఇబ్బందులు, మిశ్రమ ఫలితాలు. ఈ రోజు దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు అంతగా సాగవు. ఉద్యోగులకు పనిభారం. వైవాహిక జీవితంలో సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శివాలయంలో ప్రదక్షణలు చేయండి.

 

మకరరాశి:ఈరోజు ఆదాయానికి మించి ఖర్చులు !

ఈరోజు మిశ్రమ ఫలితాలు. ఈ రోజు కుటుంబంలో చిన్న సమస్యలు. ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి.

 

కుంభరాశి  :ఈరోజు ఆదాయం పెరుగుతుంది !

ఈ రోజు అనుకూల ఫలితాలు. ఈరోజు అనుకోని పరిచయాలు. ఆదాయం సంతృప్తినిస్తుంది. ఈరోజు రియల్‌ ఎస్టేట్‌ సంబంధ కొనుగోలు వ్యవహారాలు చేస్తారు. కార్యజయం. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.వైవాహిక జీవితంలో సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి ఎర్రని పూలతో పూజించండి,

 

మీనరాశి:ఈరోజు అనుకూలమైన శుభఫలితాలు !

ఈరోజు అనుకూల వాతావరణం. ఈ రోజు కుటుంబం కోసం రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఈరోజు వైవాహిక జీవితంలో ఇబ్బంది. పిల్లల చదువుకోసం ఆలోచనలు చేస్తారు.

పరిహారాలుః అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,

 

శ్రీ

 

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news