మీరు ఇంట్రావర్టా? ఐతే మీకిలాంటి ఇబ్బందులు తప్పవు..

-

ఇంట్రావర్ట్.. అంతర్ముఖులు.. ఎవ్వరితో పెద్దగా మాట్లాడరు. ఏది మాట్లాడినా కొలిచినట్టుగా మాట్లాడుతుంటారు. ఎక్కువ మాట్లాడితే ఏమై పోతుందో అనుకుంటారో ఏమో గానీ వారు తక్కువ మాట్లాడడానికే ఇష్టపడతారు. ఐతే ఇంట్రావర్టులకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వీరు ఎక్కువగా మాట్లాడరు కాబట్టి, ఎక్కువగా అర్థం అవ్వరు. అందువల్ల చాలా మంది వీరిని అపార్థం చేసుకుంటూ ఉంటారు. మీరు ఇంట్రావర్ట్ అయితే మీకెలాంటి ఇబ్బందులు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

ఇంట్రావర్టుల మాటలు అంత తొందరగా అర్థం కావు. కొన్ని కొన్ని సార్లు చాలా తీక్షణంగా మాట్లాడతారు. వాళ్ళ మాటల్లో అంత అర్థం ఉందా అని ఆశ్చర్యపోయేలా మాట్లాడడం వారి లక్షణం. ఐతే దీనివల్ల వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే, ఎదుటి వాళ్ళకి అర్థం కాకుండా పోతారు.

ఇంట్రావర్టుల ప్రేమకి గుర్తింపు ఉండదు. ఎంతో ప్రేమని లోపల దాచుకుంటారు గానీ, దాన్ని బయటకి చెప్పే ప్రయత్నం చేయరు. దానివల్ల అసలు ప్రేమే లేదేమో అని అవతలి వాళ్ళు అనుకుంటారు. అమ్మా నాన్నలపై కూడా ప్రేమని తెలియజేయలేరు కాబట్టి, ఇబ్బందులు వస్తాయి. ఇంట్రావర్టులు జీవిత భాగస్వాములైతే వీరిద్దరి మధ్య ఎప్పుడూ ఏదో ఒక నిశ్శబ్దం ఉంటూనే ఉంటుంది.

ఇంట్రావర్టులకి ఏమీ తెలియదని సమాజం అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా డెసిషన్ తీసుకునేటపుడు దానివల్ల జరిగే పరిణామాలేంటనేది అన్ని కోణాల్లో ఆలోచిస్తారు. దానివల్ల నిర్ణయం తీసుకోవడం ఆలస్యం అవుతుంది. అందువల్ల వాళ్ళకేమీ తెలియదన్నట్టుగా కనిపిస్తారు.

వాళ్ళ బాధని బయటకి చెప్పరు. ఎంత పెద్ద బాధైనా సరే ఒంటరిగా బాధపడతారు. అంది ముందు ఏడ్వడం వారికి రాదు. ఒంటరిగా ఎవ్వరూ లేనపుడే ఏడుస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news