కంఫర్ట్ జోన్ ఎంత ప్రమాదకరమో చెప్పే అద్భుతమైన కథ..

-

ఒక ఊరిలో సన్యాసి నివసిస్తూ ఉండేవాడు. ఆ సన్యాసికి తన గురువును కలుసుకోవాలనే కోరిక పుట్టింది. వెంటనే బయల్దేరాడు. అడవుల మధ్యలో, పొలాల మధ్యలో గురువును కలుసుకోవడానికి ముందుకు సాగిపోతున్నాడు. రెండు రోజుల తర్వాత అలసిపోయిన సన్యాసి, చుట్టూ కొండల నడుమ చిన్న మైదానంలో ఉన్న గుడిసె కనిపించి అక్కడ ఆగాడు. సన్యాసిని చూసిన ఆ గుడిసెలోని వారు ముందుకు వచ్చారు. ఒకరోజు ఇక్కడే ఉంటాను. ఏదైనా ఉంటే పెట్టండి అని సన్యాసి అడగగానే, పాలు తీసుకువచ్చి తాగమన్నారు.

పాలు తాగిన తర్వాత సన్యాసి ఈ విధంగా అడిగాడు. మీరు ఎలా బ్రతుకుతారు? చుట్టు పక్కల అసలేమీ లేదు. మీ జీవనం ఎలా సాగుతుంది అన్నాడు. అప్పుడు, ఆ రైతు ఇలా చెప్పాడు. మైదానంలో ఉన్న మేక పాలిస్తుంది. ఆ పాలను తాగుతూ, దానితో రకరకాల పదార్థాలు చేసుకుంటూ తింటాం అన్నాడు. అది విన్న సన్యాసి, ఆలోచనలో పడ్డాడు. ఆ రోజు అక్కడే గడిపిన సన్యాసి, పొద్దున్న లేచి బయలు దేరుతున్న సమయంలో రైతుతో ఈ విధంగా చెప్పాడు.

నువ్వు ఆ మేకను చంపెయ్ అని సలహా ఇచ్చాడు. రైతు షాక్ అయ్యాడు. సన్యాసి ఇలా ఎందుకు అన్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. సంవత్సరం తర్వాత గురువు కలుసుకుని వెనక్కు వస్తున్న సన్యాసికి రైతు గుడిసె కనిపించింది. దాని ముందు గడ్డి మైదానంలో ఎన్నో మేకలు, కోళ్ళు, ఆవులు ఉన్నాయి. సన్యాసిని చూసిన రైతు ముందుకు పరుగెత్తుకు వచ్చి, బాగున్నారా అని అడిగి, మీరు చెప్పినట్టు మేకను చంపేసి మాంసం అమ్మడానికి మార్కెట్ వెళ్ళాను. అక్కడ రకరకాల మనుషులు కనిపించారు.

వారి మనస్తత్వాలు వేరు వేరుగా ఉన్నాయి. ఆ తర్వాతే ఇదంతా చేయగలిగాను అంటాడు. దానికి సన్యాసి ఎంతో సంతోషించాడు. కంఫర్ట్ జోన్ కొద్ది రోజులు మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది. మీ జీవితంలో అందులో నుండి బయటపడలేకపోతే జీవించడం కష్టంగా మారుతుంది. డేర్ టు డూ మోటివేషన్ ఆధారంగా.

Read more RELATED
Recommended to you

Latest news