భారత్‌లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఈ రోజు ఎన్ని కేసులో తెలుసా?

-

న్యూఢిల్లీ: భారత్ కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 43 వేల 733 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కరోనాతో చికిత్స పొంది 24 గంటల్లో 47 వేల 240 మంది డిశ్చార్జి అయినట్లు పేర్కొంది. ఇప్పటివరకూ కరోనా చికిత్స పొంది 2 కోట్ల 97 లక్షల 99 వేల 534 మంది కోలుకున్నారని తెలిపింది.

 

ప్రతి రోజూ నమోదు అవుతున్న కేసుల్లో 55 శాతం మంది కోలుకుంటున్నట్లు పేర్కొంది. 97.18 శాతం రికవరీ శాతం ఉన్నట్లు ప్రకటించింది. 36 కోట్ల 13 లక్షల మందికి వ్యాక్సిన్లు వేసినట్లు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 4 లక్షల 59 వేల 920 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకూ 42 కోట్ల 33 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news