తెలివైన వాళ్ళు గురించి ఈ విషయాలు తెలిస్తే తెలివి లేకుండా బ్రతకడమే మంచిదేమో అనుకుంటారు..

Join Our Community
follow manalokam on social media

సమాజం మొత్తం తెలివైనవాళ్ళు, తెలివిలేని వాళ్ళుగా విభజించబడింది అనుకుంటే, అందులో అత్యంత సంతోషంగా ఉండేవారు తెలివి లేని వాళ్లే అయ్యుంటారు. అవును, మీరు చదువుతున్నది నిజమే. తెలివిలేకపోవడం అనేది చాలా మంచికే చాలా మంది చెబుతుంటారు. మీరు మరీ అత్యంత తెలివి పరులైతే మీకే ప్రమాదం అని చాలా మంది చెబుతున్నారు. ఇదేంటి, జీవితంలో ఎదగడానికి తెలివి కావాలంటారు. ఇక్కడ రివర్స్ లో చెబుతున్నారని అనుకుంటున్నారా?

మీరలా అనుకోవడం ఎలాంటి ఆశ్చర్యం లేదు. కానీ, మీరు చదువుతున్నది నిజమే. ఎక్కువ తెలివిగల వాళ్ళు ప్రతీ దానికి ఎక్కువ ఆలోచిస్తారు. ఒక పరిస్థితిని వంద రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల చాలా మంది నిర్ణయం తీసుకోవడంలో వెనకబడి ఉంటారు. ఒక విషయం పట్ల తీవ్రమైన ఆలోచన, విశ్లేషణ ఉంటే అది మానసిక బలహీనతకు దారి తీసే అవకాశం ఉంది. అదే కాదు తెలివిగల వారి ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి.

అందువల్ల సమాజంలోని జనాలకి వారు నచ్చకుండా పోయే అవకాశం ఏర్పడి, ఒంటరిగా మిగులుతారు. తెలివిగల వాళ్ళలో ఎక్కువ మంది ఒంటరిగా ఉండడానికి కారణం అదే. సమాజం ఒప్పుకోలేని తర్కాలని తెలివి గల వాళ్ళు లేవనెత్తుతారు కాబట్టి, సమాజం నుండి విడిపోయి వారి ప్రపంచంలో జీవిస్తారు. అలాగే చిన్న చిన్న వాటికి ఆనందించడం మర్చిపోతారు. ఆనందించేటపుడు వచ్చే ఆలోచనలు వారిని భౌతిక సుఖాల్ని ఆస్వాదించకుండా చేస్తాయి.

అందుకే మరీ ఎక్కువ తెలివి గల వాళ్ళకి స్నేహితులు కూడా తక్కువ. సమాజాన్ని పరిశీలిస్తూ ఉన్నప్పటికీ సమాజానికి దూరంగా ఉన్నట్టుగానే కనిపిస్తారు.అమాయకులు ఆనందించిన ఆనందాన్ని వాళ్ళెప్పటికీ ఆనందించలేరు. అందుకే తెలివి మరీ ఎక్కువైతే ప్రమాదమే అన్నమాట.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...