ప్రాణం తీసిన పకోడీ.. టెన్త్ క్లాస్ స్టూడెంట్ మర్డర్ !

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో దారుణ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఒక వ్యక్తి వీరంగం సృష్టించాడు. నిన్న  రాత్రి మాంసం పకోడీ బండి వద్ద  స్వల్ప వివాదం జరిగింది. దీంతో పకోడీ బండిని  కొవ్వూరి వీరబాబు అనే వ్యక్తి కార్ తో ఢీ కొట్టాడు.

murder
murder

కారుతో ఢీకొట్టి గాయపరచడం తో బండి వద్ద ఉన్న తండ్రి కొడుకులు శివ, ఏసు లకు గాయాలు అయ్యాయి. శివను కాకినాడ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అర్ధరాత్రి  సమయంలో మృతి చెందాడు. పదో తరగతి చదువుతున్న శివ తండ్రికి వ్యాపారంలో బండి వద్ద సహాయం చేస్తుంటాడని తెలుస్తోంది. బాలుడు మృతి చెందడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గ్రామానికి పోలీసులు భారీగా చేరుకున్నారు.