హిజ్రా అని కుంగిపోలేదు.. డాక్ట‌ర్ అయింది..

Join Our COmmunity

హిజ్రాలు అంటేనే స‌మాజంలో చాలా మందికి చిన్న చూపు ఉంటుంది. నిజ‌మే కొంద‌రు హిజ్రాలు కాక‌పోయినా ఆ అవ‌తారం ఎత్తి ప్ర‌జ‌ల‌ను వేధిస్తారు. కానీ కొంద‌రు మాత్రం క‌ష్ట‌ప‌డి పైకొస్తారు. ఉన్న‌త ల‌క్ష్యాల దిశ‌గా శ్ర‌మిస్తారు. ఎట్ట‌కేల‌కు విజ‌యం సాధిస్తారు. ఆమె కూడా అలాగే క‌ష్ట‌ప‌డింది. ఇప్పుడు ఏకంగా డాక్ట‌ర్ అయింది.

first trans woman medico of karnataka

క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరుకు చెందిన త్రినేత్ర వ‌య‌స్సు 23 ఏళ్లు. ఆమెను అంద‌రూ హిజ్రా అని వేధించేవారు. ఎగ‌తాళి చేసేవారు. అయిన‌ప్ప‌టికీ ఆమెకు కుటుంబ స‌భ్యుల నుంచి స‌హ‌కారం ల‌భించింది. ఈ క్ర‌మంలోనే ఆమె సెట్ 2015 ఎగ్జామ్‌లో 163వ ర్యాంకు సాధించింది. డాక్ట‌ర్ అయింది. స‌ర్జ‌రీ చేయించుకుని పూర్తిగా మారాక ఆమె త‌న పేరును త్రినేత్ర‌గా మార్చుకుంది.

త్రినేత్ర స‌క్సెస్ జ‌ర్నీ ఆమె లాంటి ఎంద‌రికో స్ఫూర్తినిస్తుంది. కర్ణాట‌క‌లోనే మొద‌టి ట్రాన్స్ వుమన్ మెడికోగా ఆమె పేరు సాధించింది. ఇక యూట్యూబ్ చాన‌ల్ ద్వారా ఆమె త‌న‌లాంటి వారి ఎంద‌రికో ప్రేర‌ణు ఇస్తోంది. డాక్ట‌ర్‌గానే కాక సామాజిక కార్య‌క‌ర్త‌గా కూడా ప‌నిచేస్తోంది.

TOP STORIES

మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో తడబడుతున్నారా? ఈ విషయాలు తెలుకోండి..

పెళ్ళి.. ఇద్దరి జీవితాలను ఒకటి చేసేది. ఇద్దరు వ్యక్తులను ఒకే దారిలో నడిపేది. మానవుడు అభివృద్ధి చెందుతున్న పరిణామ క్రమంలో పెళ్ళనేది అతడు సృష్టించుకున్న అత్యంత...