బ్రేకింగ్ : అఖిల ప్రియకు 14 రోజుల రిమాండ్

బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన అఖిలప్రియ కు మరో షాక్ తగిలింది. ఆమెకు మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది సికింద్రాబాద్ కోర్టు. కోర్టు పోలీసులకు మూడు రోజుల కస్టడీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అది నిన్నటితో పూర్తి కావడంతో ఈ రోజు అఖిలప్రియను న్యాయమూర్తి ముందు పోలీసులు ప్రవేశపెట్టారు.

ఈ క్రమంలో అఖిలప్రియకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. దీంతో అఖిలప్రియను చంచల్ గూడ మహిళా జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. అఖిల ప్రియకు బెయిల్ ఇవ్వాలని అఖిలప్రియ తరపు న్యాయవాదులు న్యాయమూర్తిని కోరారు. అయితే బెయిల్ పిటిషన్ పై ఈ శనివారం కోర్టు విచారణ జరపనున్నట్లు సమాచారం. ఇక ఈ కేసుకు సంబంధించి అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ఇద్దరి కోశాన్ పోలీసులు గాలిస్తున్నారు.