కామ్ గా ఉన్నప్పుడే నిర్ణయాలు తీసుకోవాలి. కానీ కామ్ గా ఉండాలంటే ఏం చేయాలి?

Join Our Community
follow manalokam on social media

నిర్ణయాలు తీసుకునేటపుడు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. కోపంలో, ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడకూడదు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అంత స్ట్రాంగ్ గా ఉండవు. అందుకే దేని గురించైనా ఆలోచించే ముందు మనసుని శాంతపర్చుకోవడం మంచిది. కానీ చాలా మందికి ఎలా శాంతపడాలో తెలియదు. కామ్ గా ఉండడం అస్సలు రాదు. ఒక విషయం వల్ల మనసు బాధపడి, ఆ బాధనుండి విముక్తి పొందడానికి మందు, సిగరెట్ వంటి వ్యసనాలకి అలవాటు పడతారు. అవే తమకి ఆనందాన్ని ఇస్తాయని నమ్ముతారు. కానీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో తెలిపే గౌతమ బుద్ధుడి కథ తెలుసుకుందాం.

ఒకానొక రోజు మిట్టమద్యాహ్యాం బుద్ధుడు తన విద్యార్థులతో కలిసి ఊరికి వెళ్తున్నాడు. మార్గ మధ్యంలో వాళ్ళు ఒక సరస్సుని దాటుతున్నారు. అప్పుడు బుద్ధుడు తన విద్యార్థితో, సరస్సులో నుండి తాగడానికి నీళ్ళు తీసుకురా అని పంపించాడు. విద్యార్థి సరస్సు వద్దకెళ్ళి చూడగా, అక్కడ బట్టలు ఉతుకుతున్నవాళ్ళు కనిపించారు. అలాగే అటుగా వెళుతున్న ఒక గుర్రపు బండి కనిపించింది. ఆ దుమ్ము ధూళికి నీళ్ళన్నీ మట్టి మట్టిగా ఉన్నాయి. అలాంటి నీళ్ళు తీసుకువెళ్ళడం ఇష్టం లేని విద్యార్తి, బుద్ధుడితో జరిగిన విషయం చెప్పాడు.

అప్పుడు బుద్ధుడు, కొంచెం సేపు ఇక్కడే ఆగి వెళదాం అని ఒక చెట్టుకింద కూర్చున్నాడు. గంట తర్వాత మళ్ళీ అదే విద్యార్థికి నీళ్ళు తెమ్మని చెప్పాడు. సరస్సు వద్దకి వెళ్ళిన విద్యార్థి నీళ్ళు మంచిగా ఉండడం చూసి, చెంబులో తీసుకువచ్చాడు. వాటిని బుద్ధుడు తాగాడు. అప్పుడు బుద్ధుడు ఇలా చెప్పాడు. మట్టి మట్టిగా కనిపించిన నీరు ఏమీ చేయకుండానే కొద్ది సేపయ్యాక మంచినీళ్ళలా మారాయి. అంటే, అస్తవ్యస్తంగా చిరాగ్గా ఉన్న మనసుని కొద్దిసేపు వదిలేస్తే ఏమీ చేయకుండానే కామ్ గా మారుతుందని చెప్పాడు.

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...