కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఈ పనులు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందిట..!

-

కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం. ఈ మాసంలో చాలామంది ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది కూడా కార్తీక మాసంలో శుక్ల పక్షంలో ఈ పవిత్రమైన ఏకాదశి వస్తుంది. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున విష్ణు మూర్తి నిద్ర లోకి వెళ్తారు. నాలుగు నెలల యోగనిద్ర తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి మేలుకోవడం జరుగుతుంది.

దీని మూలంగా దేవత్తుని ఏకాదశి అని కూడా దీనిని పిలుస్తారు. ఈ మాసంలో మనం చేసే పుణ్యకార్యక్రమాలు అనగా ధూపం దీపం దానం వంటివి పుణ్య కార్యక్రమాలను చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. అందుకనే ఈ మాసం అంతటా కూడా విష్ణుమూర్తి ని కొలుస్తూ ఉంటారు. ఉపవాసాలు ఉంటారు. ముఖ్యంగా సోమవారం నాడు ఉపవాసాలు ఉంటారు. ఈ ఏడాది నవంబర్ 4న ఏకాదశి వచ్చింది. శుక్రవారం రాత్రి ఏడు గంటల రెండు నిమిషాలకు ఇది ముగుస్తుంది.

ఏకాదశి రోజు చేయవలసిన పనులు:

ఏకాదశి రోజు దీపం పెట్టుకుంటే చాలా మంచి కలుగుతుంది. చక్కటి ఫలితాన్ని మీరు పొందొచ్చు.
కార్తీక ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని కొలిస్తే కోరికలన్నీ తీరుతాయి.
అలానే బ్రహ్మ ముహూర్తం లో స్నానం చేయడం కూడా చాలా మంచిది. విష్ణుమూర్తికి దీపం దీపం పెట్టి ఉపవాసం ఉంటే చక్కటి ఫలితాలను పొందవచ్చు.
అలానే ఈ రోజున వివాహం చేసుకోవడం కొత్త ఇంట్లోకి వెళ్లడం వంటి శుభకార్యాలు కూడా చాలా మంది జరుపుతూ ఉంటారు.
ఈరోజున అస్సలు తులసి ఆకులని తెంపకూడదు విష్ణుమూర్తి కి ఆగ్రహం వస్తుంది. మంచి ఆలోచనలతో మంచి పనులతో ఈరోజు అంతా కూడా గడిపితే చక్కటి ఫలితాలను పొందొచ్చు అని పండితులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news