తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబానికి, టీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోందన్న ఆవేదన, తీవ్ర అసహనంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాత ముచ్చటను పదే పదే చెప్పారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ చూపించిన వీడియోలో ఉన్న వారితో బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు కిషన్‌రెడ్డి. కిరాయికి తెచ్చుకున్న ఆర్టిస్టులు, సొంత పార్టీ నేతలతో కలిసి అందమైన అబద్ధాన్ని వీడియో తీసి దాన్ని నిజం అని చెప్పేందుకు సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ఇది రోజురోజుకూ ఆయనలో పెరుగుతున్న అసహనానికి, అభద్రతా భావానికి నిదర్శనమన్నారు కిషన్‌రెడ్డి. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఖూనీ చేస్తున్న ముఖ్యమంత్రి.. దేశంలో ప్రజాస్వామ్యం గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు నటించడం హాస్యాస్పదమని దుయ్యబట్టారు కిషన్‌రెడ్డి.
అసలు ఆ వీడియోలో ఉన్న వారితో బీజేపీకి సంబంధం లేదని, కిరాయికి తెచ్చుకున్న ఆర్టిస్టులు, సొంత పార్టీ నేతలతో కలిసి అందమైన అబద్ధాన్ని వీడియో తీసి దాన్ని నిజం అని చెప్పేందుకు సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నారు కిషన్‌రెడ్డి. రోహిత్‌రెడ్డి పెద్ద నీతిమంతుడా అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబానికి, టీఆర్ఎస్ ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోందన్న ఆవేదన, తీవ్ర అసహనంతో పాత ముచ్చటను పదే పదే చెప్పారన్నారు.