స్ఫూర్తి: సొంతంగా పరీక్షకి ప్రిపేర్ అయ్యి.. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ గా..!

-

చాలా మంది కాంపిటేటివ్ పరీక్షల కోసం డబ్బులు కట్టి కోచింగ్ తీసుకుంటున్నారు. అయినప్పటికీ పరీక్షలో విఫలమవుతున్నారు. కానీ ఇతను మాత్రం ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా సొంతంగా ప్రిపేర్ అయ్యి.. టాప్ ర్యాంక్ పొట్టి డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు. మరి అతని గురించి ఇప్పుడు చూద్దాం. వీరిది ప్రకాశం జిల్లా మార్కాపురం. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయం చేసేవారు. వచ్చే ఆదాయంతో పిల్లలను చదివిస్తూ, కుటుంబాన్ని పోషించే వారు.

ఇతని చదువంతా కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్తయింది. 2000లో ఇంటర్మీడియట్ అయ్యాక బీటెక్ చదవాలని అనుకున్నాడు. ఎంసెట్లో 1000 ర్యాంకు సాధించి.. ఆ తర్వాత బీటెక్ పూర్తి చేశాడు. 2005లో సర్క్యూట్ డిజైన్ ఇంజనీరింగ్ గా ఉద్యోగం వచ్చింది. అలానే ఆ ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయాల్లో పాఠశాలలకు వెళ్లి క్లాసులు చెప్పేవాడు. అయితే తనకి మరెంత సేవ చెయ్యాలి అని అనిపించింది. ప్రభుత్వ సర్వీసులు ద్వారా మరింత సేవ చెయ్యచ్చని అనుకున్నాడు.

2009లో ఉద్యోగాన్ని వదిలేసి సివిల్స్ ని లక్ష్యంగా పెట్టుకొని చదవడం మొదలు పెట్టాడు. 2011 లో మొదటి సరి పరీక్ష రాసాడు. ప్రిలిమ్స్ లో పాస్ అయినా మెయిన్స్ లో క్వాలిఫై అవ్వలేదు. ఆ తర్వాత సంవత్సరం నుంచి సివిల్స్ పరీక్ష విధానంలో మార్పు వచ్చింది. 2011లో గ్రూప్స్ పైన దృష్టి పెట్టి సొంత ప్రిపరేషన్ మొదలు పెట్టాడు. కుటుంబం పై ఆధార పడటం ఇష్టంలేక గ్రూప్ టు, బ్యాంక్, పీవో కోచింగ్ తీసుకుంటున్న వారికి ఫ్యాకల్టీగా పనిచేశాడు.

2011లో పరీక్షని రద్దు చేశారు. ఆ తర్వాత గతేడాది రీ ఎక్సమినేషన్ నిర్వహించారు. అందులో టాపర్ గా నిలిచాడు. నిజానికి ఎప్పుడూ కూడా ఓడిపోతామని నిరాశ పడకూడదు. పట్టుదలతో ముందుకు వెళ్తే కచ్చితంగా విజయం అందుకోవచ్చు. నిజానికి ప్రతి ఒక్కరూ వాళ్ల మీద నమ్మకం ఉంచుకుని సహనంతో ప్రిపరేషన్ సాగిస్తే తప్పకుండా విజేతలవుతారు. ఎప్పుడు కూడా విసుగు చెందకుండా మానసికంగా దృఢంగా ఉండాలి. స్వయంకృషిని నమ్ముకుని ముందుకు వెళ్తే కచ్చితంగా ఏదైనా సాధించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news