గీతకి 13 ఏళ్లప్పుడు ఆమెకి కంటిచూపు సమస్య వచ్చింది. డాక్టర్ దగ్గరికి తీసుకు వెళితే ఆ చూపుని తీసుకు రావడం కుదరదు అని చెప్పారు. కనీసం దృష్టి మరింత క్షీణించకుండా ఆపడం కూడా అవ్వదు అని డాక్టర్లు చెప్పేశారు. ఆమెకి 15 ఏళ్ళు వచ్చేటప్పటికి మొత్తం చూపు పోయింది.
ఇప్పుడు ఆమె వయస్సు 39 సంవత్సరాలు. చూపులేక పోయినప్పటికీ ఆమె ఏనాడూ కుంగిపోలేదు. ఆమె చేయగలిగింది ఆమె చేయాలని పట్టుదలతో ముందుకు వెళ్ళింది. ఇప్పుడు ఆమె సక్సెస్ ఫుల్ ఉమెన్ అని చెప్పవచ్చు. గీత సొంత కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంది. దీని ద్వారా ఆమె నెలకి 50,000 సంపాదిస్తోంది.
గీతాస్ అనే పేరుతో ప్రొడక్ట్స్ ని మార్కెట్‌కి సప్లై చేస్తుంది. ఈమె గురించి పూర్తి వివరాల్లోకి వెళితే… కేరళలోని త్రిశూర్ కి చెందిన ఆమె గీత. చూపు కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో చదువుని కొనసాగించింది. గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. ఉద్యోగం ఈమెకి ఎవరు ఇవ్వకపోవడంతో భర్త సహకారంతో చిన్న రెస్టారెంట్ ప్రారంభించింది.
అయితే ఆమె ఆర్గానిక్ ఫుడ్ రెస్టారెంట్ ని ప్రారంభించిన కొన్నాళ్ళు బాగానే ఉంది కానీ తర్వాత ఖాళీ చేయాల్సి వచ్చింది. తర్వాత మరో ప్రయత్నం చేసింది. ఈసారి ఈమె సొంత పరిశ్రమను ఏర్పాటు చేసుకుంది.
గీతాస్ హోమ్ హోమ్ బ్రాండ్ మీద ఆమె నెయ్యి, పచ్చళ్ళు, బాలింతలు తినాల్సిన ఆహారాన్ని అమ్ముతోంది. ఈ వ్యాపారం కేరళ నుంచి కాశ్మీర్ వరకు విస్తరించింది. ఇలా ఈమె ఇప్పుడు సక్సెస్ ఫుల్ ఉమెన్ గా రాణిస్తోంది. చూపు కోల్పోయినా సరే ఆమె తనపై ఉన్న నమ్మకాన్ని కోల్పోలేదు. నిజంగా ఇలాంటి మహిళలు ప్రతి ఒక్కరికి ఆదర్శం ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే ఎవరైనా సక్సెస్ అవ్వగలరు.