Success story : బ్యాంకింగ్ ఉద్యోగాన్ని వదిలేసి మరీ వ్యవసాయం… ఇప్పుడు ఏడాదికి అరవై లక్షలు పైనే..!

-

జీవితంలో స్థిరపడాలని మంచి పొజిషన్ లోకి రావాలని ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో కలల్ని నెరవేర్చుకోవాలని.. ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అనుకుంటుంటారు. కానీ చాలా కొంత మంది మాత్రం సమాజానికి ఏదైనా చేయాలని అనుకుంటూ ఉంటారు. ఆ కొందరిలో ఈ జంట కూడా ఒకరు. మధ్య ప్రదేశ్ కి చెందిన ప్రత్యక్ష, ప్రతీక శర్మ దంపతులు సమాజానికి ఏదైనా సేవ చేయాలని అనుకున్నారు. దీంతో వాళ్ళ బ్యాంకింగ్ ఉద్యోగాలు కి స్వస్తి చెప్పేసి ఒక స్టార్టప్ ని మొదలు పెట్టారు. దీని ద్వారా రైతులకు సహాయాన్ని అందిస్తున్నారు.

వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రజలకు నేరుగా అందిస్తున్నారు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ జంట గ్రీస్ అండ్ గ్రీన్స్ అనే దానిని ప్రారంభించారు. సేంద్రీయ పద్ధతిలోనే పంటలు పండించి ఎంతో శుచిగా వినియోగదారులకు ఇళ్ళకు అందించడం మొదలు పెట్టారు. అయితే ఇలా చేయడం వల్ల రైతులకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి అని గ్రహించారు.

పైగా పూర్తి ఆర్గానిక్ కూరగాయలు ప్రజలకి ఇస్తున్నారు. దీనితో వాళ్ళకి చాలా తృప్తి కలిగింది. అయితే ప్రతీ దాంట్లోనూ కూడా కష్ట నష్టాలు ఉంటాయి. వాటిని దాటుకుంటూ వెళ్తే అప్పుడు ఎంతో అందంగా జీవితం మారుతుంది. కానీ ఆ కష్టాలన్నీ మనం దాటలేము అని అక్కడితో ఆగిపోతే అక్కడితోనే ఆగిపోతూ ఉంటాము.

ఏదో విధంగా వాళ్ళు వాటినన్నిటిని దాటుకుని వెళ్లిపోయారు. వ్యవసాయం గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నారు. ఎన్నో వాటిపై అధ్యయనం కూడా చేశారు. ఎన్నో కష్టాలు పడి ముందుకు వెళ్లారు. మొదట్లో వీరు 5.5 ఎకరాలు ఆర్గానిక్ పద్ధతి లో పంటలు పండించి ఆ తర్వాత ఉత్పత్తుల్ని నేరుగా ప్రజలకు అందించడం మొదలు పెట్టారు.

వీరి బిజినెస్ మోడల్ ఐఐఎం ప్రొఫెసర్లని ఆకర్షించింది. ఆ తర్వాత రిజిస్టర్డ్ అయింది. ఆర్డర్లు కూడా పెద్ద సంఖ్యలో రావడం మొదలయ్యాయి ఎప్పుడు కంటే 5 రెట్లు ఆర్డర్లు వచ్చాయి. గత ఏడాది 60 లక్షల ఆదాయం వచ్చింది. హోమ్ డెలివరీ ద్వారా 250 కంటే ఎక్కువ ఉత్పత్తుల్ని ప్రజలకి అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news