స్ఫూర్తి : అప్పుడు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థిని.. ఇప్పుడేమో ఐపీఎస్..!

-

కొంతమంది సక్సెస్ ని చూస్తే చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. కొంత మంది సక్సెస్ ని అందుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. నిజానికి సక్సెస్ కి వయసుతో సంబంధం లేదు. అలానే ఆర్థిక పరిస్థితుల్లో కూడా సంబంధం లేదు. కష్టపడి ప్రయత్నిస్తే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. ధనవంతులైనా పెద్దవారైనా సరే సక్సెస్ అవ్వచ్చు. దివ్య సక్సెస్ ని చూస్తే మీరు కచ్చితంగా మెచ్చుకుంటారు. ఈమె వయసు కేవలం 24 ఏళ్లు దివ్య ని యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటే కచ్చితంగా సక్సెస్ అవుతారు.

 

హర్యానా కి చెందిన ఆమె ఈమె. 15 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయారు. అప్పటినుండి ముగ్గురు కూతుళ్ళ బాధ్యతని తల్లే చూసుకుంటుంది. వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కూతుళ్ళని పెంచింది. ఆర్థిక పరిస్థితులు వలన దివ్య ప్రభుత్వ స్కూల్లోనే చదువుకుంది అలానే డిగ్రీ కూడా ఆమె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకుంది. పొలిటికల్ సైన్స్ విభాగంలో ఎంఏ పూర్తి చేసింది చదువు పూర్తయిన తర్వాత ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలని ఆమె టీచర్గా పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది.

సొంతంగా యూపీఎస్సీ పరీక్షకి కూడా ఆమె ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది. రోజు 10 గంటల సేపు చదువుకునేది 2021 లో మొదటిసారి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ సర్వీస్ పరీక్ష రాసింది. మొదటి ప్రయత్నంలోనే ఆమె 438వ ర్యాంకు సాధించింది. ఆ తర్వాత ఈమె 2022లో రెండోసారి మళ్లీ పరీక్షలు రాసింది. ఏకంగా 105 ర్యాంక్ సాధించింది. పక్కా ప్లానింగ్ తో చదివితే కచ్చితంగా సివిల్స్ లో మంచి ర్యాంకు వస్తుందని దివ్య తెలిపింది. దివ్యని ఆదర్శంగా తీసుకుంటే కచ్చితంగా అమ్మాయిలు అనుకున్నది సాధించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news