వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి..వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తారో క్లారిటీ ఇచ్చారు. ఆయన సీటుపై రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆయన స్పందిస్తూ..తాను ఒంగోలు అసెంబ్లీ బరిలో నుంచే పోటీ చేస్తానని, ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు. దీంతో తన వైవీ సుబ్బారెడ్డికి పరోక్షంగా చెక్ పెట్టారని టాక్ నడుస్తోంది.
ఎందుకంటే ఇటీవల టిటిడి ఛైర్మన్ పదవి నుంచి సుబ్బారెడ్డి తప్పుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ఆ బాధ్యతలు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఆయన ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. ఎందుకంటే 2014 ఎన్నికల్లో సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో సీటు త్యాగం చేశారు. ఒంగోలు ఎంపీగా మాగుంట గెలిచారు. ఇప్పుడు మాగుంట మళ్ళీ ఒంగోలు ఎంపీగానే పోటీ చేస్తారని, తాను ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని బాలినేని ప్రకటించారు. దీని ద్వారా వైవీకు సీటు లేదనే విధంగా చెప్పుకొచ్చారు.
అయితే వైవీ, బాలినేని సొంత బంధువులు..కానీ రాజకీయంగా పడటంలేదు.ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ పోరులో బాలినేని ఈస్ట్ రాయలసీమ వైసీపీ కో-ఆర్డినేటరు పదవి నుంచి తప్పుకున్నారు. అలాగే ఆయన వైసీపీకి కూడా గుడ్ బై చెప్పేస్తారని ప్రచారం వచ్చింది. ఇదంతా సుబ్బారెడ్డి వర్గం చేసిన పని అని బాలినేని వర్గం ఆరోపిస్తుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా టిటిడి ఛైర్మన్ పదవి నుంచి సుబ్బారెడ్డి తప్పుకోవడం, నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఏదో క్లారిటీ లేకపోవడం చూస్తే..రాజకీయంగా సుబ్బారెడ్డికి చెక్ పడుతుందా? అనే పరిస్తితి. చూడాలి మరి ఈ సారి సుబ్బారెడ్డికి ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ వస్తుందో లేదో.