నేను నేర్పి, నేర్చుకున్న పాఠం..!

-

సాయంత్రం 6 అవుతోంది.. మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ జంక్షన్‌.. నా ఫ్రెండ్‌ కలిస్తే మాట్లాడుతూ రోజు రోడ్డు పక్కన సాయంత్రం టిఫిన్ చేస్తున్నాం. అప్పుడు ఆ టిఫిన్ సెంటర్ కి ఎదురుగా ఉన్న స్కూల్ బెల్ కొట్టారు. పిల్లలు హుషారుగా అందరూ బయటకు వస్తున్నారు. నేను అప్పుడే రెండు ఇడ్లీ పెట్టించుకుని… టమాటో చెట్నీ వేయించుకున్నాను…

సరిగా రోడ్డు పక్కన ఏదైనా వాహనం లిఫ్ట్ ఇస్తుందేమో అని వేచి ఉన్న ఇద్దరు పిల్లలు, ఒక బండిని ఆపారు. ఆ బండి వేగంగా ఉండటంతో వాళ్ళు ఆపిన దగ్గరి నుంచి 50 మీటర్ల దూరంలో ఆగింది. ఆపిన వాడు కాకుండా మరొకడు వేగంగా వెళ్లి ఆ బండి ఎక్కాడు.

దీనితో నిరాశగా మరొక విద్యార్ధి డల్ గా అలా చూస్తుండిపోయాడు. నేను టిఫిన్ తినడం అయింది. డబ్బులు ఇచ్చేశాను… అక్కడి నుంచి బయల్దేరి వెళ్దాం అనుకున్నాను… ఇక ఇదే సమయంలో నాకో ఆలోచన వచ్చింది. ఆ పిల్లాడి దగ్గరకి వెళ్లి… చిన్నా నాతో రారా నేను డ్రాప్ చేస్తాను అన్నాను. పిల్లాడు కదా నా మాట నమ్మి వచ్చేసాడు.

నా కారులో ఎక్కించుకున్నాను… వాడిలో నేను ఒక హుషారు చూసాను. ఎందుకు రా నవ్వుతున్నావ్ అన్నాను. థాంక్స్ అంకుల్ అన్నాడు. ఇక్కడి నుంచి మా సంభాషణ…

నేను; ఎందుకు థాంక్స్…?

పిల్లాడు; మీరు హెల్ప్ చేయకపోతే నడిచి వెళ్ళేవాడిని, ఇప్పుడు హ్యాపీ గా ఉంది.

నేను; ఏమర్ధమై౦ది చెప్పు నీకు…?

పిల్లాడు; ఆ బైక్ వెళ్లిపోయింది మీరు హెల్ప్ చేసారు.

నేను; ఎప్పుడూ కూడా చిన్న చిన్న వాటికి నిరాశపడకు. వెయిట్ చేసిన వాడు, కష్టపడిన వాడు ఎప్పటికి మంచి స్థానంలో ఉంటాడు. ఇది నీకు నేను చెప్పే పెద్ద మాట గాని… నీకు ఇప్పుడు చెప్పే గుర్తుంటుంది అని చెప్తున్నాను… విను,

ఎప్పుడు కూడా కష్టపడిన వాడు ఫెయిల్ అవ్వడు. నీకు ఏదోక బైక్ ఎక్కడం అనేది అవసరం. దొరకక డల్ అయిపోయావ్. కాని నీకు బైక్ కంటే బెస్ట్… కారు వచ్చింది. ఇంకా ఫాస్ట్ గా ఇంటికి వెళ్తున్నావ్, సేఫ్ గా వెళ్తున్నావ్. అవునా కాదా…?

పిల్లాడు; అవును అంకుల్

నేను; సో ఎప్పుడూ కూడా నీకు నిరాశ అనేది వద్దు. మనం కష్టపడి వెయిట్ చెయ్యాలి. ఈ రోజు బైక్ రేపు స్టడీ, మార్క్స్, జాబు, ఇంకేది అయినా సరే సో ఎప్పుడు నిరాశ పడొద్దు. మనకు మంచి అవకాశాలు వస్తాయి. రేపు వెళ్లి మీ మిస్ కి చెప్పు, ఈవెనింగ్ అమ్మకు చెప్పు. ఒక ఛాన్స్ రాకపోతే ఇంకొకటి వస్తది. టైం కోసం వెయిట్ చెయ్యాలని. వెయిట్ ఫర్ ది బెస్ట్.

నేను ఆ రోజు ఆ పిల్లాడికి చెప్పిన మాట చిన్నది అయి ఉండవచ్చు ఏమో గాని, తను రేపు ఒక మంచి స్టేజి వచ్చాక సంఘటన  ఏదైనా ఒక సందర్భంలో ఈ చిన్న సంఘటన, నేను కచ్చితంగా గుర్తుంటాను. అతని మైండ్ లో ఈ చిన్న సంఘటన ఎన్నో నేర్పుతుంది. నేర్చుకుంటాడు అని ఆశిస్తున్నా… ఇంతకి మీకు ఒకటి చెప్పలేదు. పిల్లాడికి నా పేరు చెప్పలేదు. ఎందుకంటే అంకుల్ అన్న పిలుపు బాగుంది. రేపు ఒక అంకుల్ అనే అనుకోవాలని.మీక్కూడా ఓ వ్యక్తిగా మాత్రమే గుర్తుండాలి.. అందుకే నా పేరు చెప్పట్లేదు..

ఈ మధ్య చాలా చోట్ల చూస్తున్నాం.. వింటున్నాం.. మార్కులు తక్కువ వచ్చాయని, ప్రేమించిన అమ్మాయి దక్కలేదని, నాన్న తిట్టాడని, మంచి జాబ్‌ రాలేదని ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. ఇది కాక పోతే ఇంకోటి.. చదువే అన్నీ కాదు.. చదువుల్లో ఫెయిల్‌ అయి బిజినెస్‌లో సక్సెస్‌ అయినవాళ్లు ఎందరో.. ఇప్పటి వరకు ప్రేమించని వారు ఎవ్వరు లేరు.. అలా అని అందరి ప్రేమా సక్సస్‌ అయ్యిందీ లేదు. సో మరో అవకాశం మరో ప్రేమ మనకోసం వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news