స్మ్రితి ఇరాని పోస్ట్ చేసిన వీడియో చూస్తే లేచి సెల్యూట్ చేస్తారు…!

-

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. 2019 లో బయటకు వచ్చిన ఈ వీడియోని ఆమె తాజాగా మళ్ళీ పోస్ట్ చేసారు. 2 నిమిషాల 19 సెకండ్ క్లిప్ ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతుంది. “కొన్ని కథలు మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం ఉంది.” అని పేర్కొంటూ స్మ్రితి ఇరానీ ఆమె ఈ వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు.

బన్వారీ తోలా అనే ఉత్తర ప్రదేశ్ గ్రామంలో చిత్రీకరించిన ఈ క్లిప్ లో జ్యోతి మరియు నేహా అనే ఇద్దరు యువతులు వారి తండ్రి బార్బర్షాప్ నిర్వహిస్తూ ఉంటారు. దీనితో కష్టపడటానికి లింగ భేదాలు లేవనే విషయాన్ని ఆ ఇద్దరు అమ్మాయిలూ చెప్పారు. గ్రామంలో ఉన్న పరిస్థితులను వివరిస్తూ ఒక బాలుడి గొంతుతో ఈ వీడియో మొదలవుతుంది. ప్రతీ ఒక్క దృశ్యాన్ని చూపిస్తారు.

పిల్లలు స్కూల్ కి వెళ్ళడం, పనులకు వెళ్ళడం, గ్రామంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి… అంటూ అందమైన వాయిస్ తో ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఈ వీడియో ఉంటుంది. ఇక చివర్లో ఇద్దరు బాలికలు బార్బర్ షాప్ లో గడ్డం చేస్తున్నట్టుగా ఉంటుంది వీడియో. చివర్లో ప్రముఖ సంస్థ జిల్లెంట్ యాడ్ తో ముగుస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని విశేషంగా ఆకట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news