మిస్ ఇండియా ఇంటర్నేషనల్‌గా.. మూడు రాష్ట్రాల అందాలతార!

-

నవంబర్ 18న జరిగిన మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2019 ఫైనల్స్ విజేత నిషా తాళంపల్లి. మూడురాష్ర్టాల నుంచి పోటీ చేసిన ఏకైక యువతి. హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె కన్నడ అమ్మాయే అయినా తెలుగమ్మాయినే అంటున్నది. ఆమె విజయానికి కారణం తెలుగువారేనంటూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నా మిస్‌ఇండియా కథనం.

ఇండోనేషియాలోని జకర్తాలో మిస్‌ఇండియా పోటీలు చివరి రౌండ్ మొదలైంది. వేదికపై మొత్తం 30 మంది అందాలతారలు. ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ ఆహ్వానిస్తున్నారు. భయం, ఆందోళన ఎన్ని ఉన్నా బయటకు మాత్రం సంతోషంగా నవ్వుతూ ర్యాంప్‌వాక్ చేస్తున్నారు. ఎదురుగా జడ్జ్‌లు కూర్చోనున్నారు. అందరూ అందంగా ఉన్నారు. ఏ ప్రశ్న అడిగినా సరైన సమాధానం చెబుతున్నారు. వీరిలో జడ్జెస్ ఎవరిపేరు ఫైనల్ చేస్తారా? అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

వీరిలో తెలివైనవారు ఎంతమంది ఉన్నా.. ఒకరే విజేతగా నిలుస్తారు. కొంచెం తడబడినా పక్కవారికి అవకాశం ఇచ్చినవారవుతారు. సమయం ముగుస్తున్నది. కౌంట్ డౌన్ టైం స్టార్ట్స్ నౌ 1.. 2.. 3.. ది విన్నర్ ఈజ్ నిషా తాళంపల్లి. విజేతగా నిలిచిందంటూ జడ్జెస్ చేతులు ఎత్తారు. మూడురాష్ర్టాల నుంచి పోటీచేసిన అమ్మాయిగా నిషాకు మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రజల నుంచి అందరికన్నా ఎక్కువ ఓట్లు నిశా సొంతంచేసుకుంది.

పేదకుటుంబం నుంచి ఒక అమ్మాయి ఉన్నత స్థాయిలకు వెళ్లాలంటే ఎన్ని అడ్డంకులు దాటుకొని ముందుకు వెళ్లాలో అందరికీ తెలుసు. అలాంటిది అందాల పోటీల విషయానికి వచ్చేసరికి తెలుగు వారిని తొక్కేయాలని చూసే దేశాలు ఎన్నో. తెలుగు రాష్ట్రాలు మిగిలిన రాష్ట్రాలతో ఎందులోనూ తీసిపోరంటున్నది నిషా తాళంపల్లి. అందం, అభినయంలో తెలుగువారే సాటి. పేదరికంలో పెరిగిన ఆమెకు ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉంది. ఆ పరిస్థితులే ఆమెను అందాల పోటీల్లో పాల్గొనేలా చేసింది. అందం విషయంలో ప్రపంచ సుందరి ప్రియంక చోప్రాను ఆదర్శంగా తీసుకున్నది. కాలేజీల్లో జరిగే అందాల పోటీలకు హాజరవుతుండేది. అంతకు మించి ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఒక ఛాన్స్‌కోసం ఎదురుచూస్తుండేది.

మిస్ ఇండియా పోటీలు ఆసన్నమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక రాష్ర్టాల నుంచి ఎవరూ పోటీచేయడం లేదు. మన రాష్ట్రాల నుంచి ఎలాగైనా పోటీచేయాలి. మిస్‌ఇండియా లిస్ట్‌లో తమ పేరుండాలని తపన పడింది. దరఖాస్తు చేసింది. పోటీలో భాగంగా నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి. చివరి రౌండ్‌కు పోటీ చేసిన 9,000 మంది ఆశావాదులలో 30 మందిని ఫైనలైజ్ చేశారు. అందులో నిషా కూడా ఉంది. ఆన్‌లైన్ ద్వారా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రజలు నిశాకు ఓటు వేయాలని కోరింది. మనమ్మాయి చివరి రౌండ్‌కు చేరినందుకు గర్వపడుతూ ఓటు వేయాలని నెటిజన్లు కమెంట్లు పెట్టారు. నవంబర్ 13 వరకు ఓటింగ్ ప్రాసెస్ జరిగింది.

కన్నడ భామ
కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా, ముదున్సూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్, ఇందుమతి దంపతులకు నిషా జన్మించింది. చిన్నప్పటి నుంచి నిషాకు పట్టుదల ఎక్కువ . ఏదైనా చేయాలనుకుంటే సాధించి తీరుతుంది. ఆమె పట్టుదల చూసిన తల్లిదండ్రులు నిషా అభిప్రాయాలను గౌరవించేవారు. స్కూల్, కాలేజ్‌లో చురుగ్గా ఉండేది. లెక్చరర్ల దగ్గర మంచి పేరు ఉంది. కూతురి భవిష్యత్తుకు పేదరికం అడ్డుకాకూడదనుకున్నారు. చదువుకోసం హైదరాబాద్‌కు పంపించారు. డిప్లమా ఏవియేషన్ కోర్స్‌లో చేసింది. పూర్తయ్యాక రెండేండ్ల నుంచి ఎంఎన్‌సి కంపెనీలో ఉద్యోగం చేసింది. ఏ వృత్తిలో ఉన్నా ప్యాషన్ అనేది ఉంటుంది. అది వెంటాడుతూనే ఉంటుంది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే అందాలపొటీల్లో పాల్గొనేది. అయితే.. అప్పటివరకు పాల్గొన్నవన్నీ చిన్నవే. ఈ సారి పెద్దపోటీకే గాలం వేసింది నిషా. ఇంటర్నేషనల్ మిస్ ఇండియా పోటీలో పాల్గొనేందుకు తల్లిదండ్రులను అడిగింది. వారు కూడా ప్రోత్సహించారు.

 

పల్లెలకు సాయం
పుట్టిపెరిగిన కర్ణాటకలో అయినా తెలంగాణలో చదివింది. తెలుగు అనర్గళంగా మాట్లాడుతుంది. తాను కూడా తెలంగాణ బిడ్డనే అంటున్నది. నిషా పోటీకి ఎంపికయినప్పటి నుంచి మనకెందుకులే అని అనుకోకుండా అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారు. మన రాష్ట్రం నుంచి పాల్గొంటున్న అమ్మాయికి ఏ మాత్రం సంబంధం లేని కన్నడిగాస్ వెల్‌ఫేర్ సొసైటీ హైదరాబాద్ ప్రెసిడెంట్ ధర్మేంద్ర పూజారి బగ్దూరి, బిదార్ రాజకీయనాయకుడు బాసు హిలాల్‌పుర, రామకృష్ణారెడ్డి నిషాకు సహాయం చేశారు. ఓటింగ్ సమయంలో మిస్ ఇండియాగా గెలిస్తే ఏం చేస్తావ్ అని నిషాను అడిగితే నేను పల్లెగ్రామం నుంచి వచ్చాను. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలిసు. వీలైనంత వరకు పల్లెప్రజలకు సహాయం చేస్తాను. సోషల్ సర్వీస్ చేస్తా. కొత్త పనులకు శ్రీకారం చుడుతాను అని సమాధానం ఇచ్చింది. ఇప్పుడు కూడా అదేమాట మీద నిలబడుతానంటున్నది నిషా.

పరిస్థితులు మారాయి
ఎక్కడ ముదున్సూర్, ఎక్కడ ఇండోనేషియా. ఊరుకూ అంకితమనుకుంటున్న సమయంలో చదువును ఆయుధంగా మార్చుకున్నాను. ఉన్నత చదువుకోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. అక్కడే నా జీవితం మలుపుతిరిగింది. జీవితంపై ఆశ కలిగింది. ప్యాషన్‌వైపు అడుగులు వేశాను. తెలుగమ్మాయిగా మారాను. అందరి అభిమానం గెలుచుకున్నాను. తెలుగు ప్రజల ఆదరణే నన్ను మిస్ ఇండియాగా ఈరోజు మీ అందరి ముందు నిలబెట్టింది.

– నిషా తాళంపల్లి

Read more RELATED
Recommended to you

Latest news