బ్రేకింగ్‌: భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా..

-

నిన్న స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర ఈ రోజు భారీగా పైకెగ‌సింది. శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయలు పెరిగి 39,510 రూపాయల కు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 110 రూపాయలు పెరిగి 36,220 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు పెరుగుదల నమోదు చేయడంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 200 రూపాయలు పెరిగి 46,350 రూపాయలకు ఎగబాకింది.

ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పై చూపులు చూశాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 150 రూపాయలు పెరిగింది. దీంతో 38,200 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపోపాయాలు పెరగడంతో 37,000 రూపాయల వద్దకు చేరింది. ఇక వెండి ధర మాత్రం కేజీకి 200 రూపాయలు పెరిగి 46,350 రూపాయల వద్దకు చేరుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news