గ్లాసుల్లో స‌గం నీరే పోయాలంటున్న యూపీ ప్ర‌భుత్వం.. ఎందుకంటే..?

-

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్లో నీటి పొదుపుపై మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఓ వినూత్న నిర్ణ‌యం తీసుకుంది. యూపీ సెక్ర‌టేరియ‌ట్‌లోని స‌మావేశాల‌కు ఇక‌పై సగం నీటితో ఉన్న గ్లాసుల‌నే పెట్ట‌మ‌ని ఆదేశాలు జారీ చేసింది.

నీటిని వృథా చేయ‌రాదు.. పొదుపు చేయండి.. అంటూ ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు చెబుతుంటాయి. కానీ ప్ర‌జ‌లే నిజానికి నీటిని పొదుపు చేస్తారు.. ప్ర‌భుత్వాలు చేయ‌వు.. అంటే ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ప‌నిచేసే అధికారులు నీటిని పొదుపు చేయ‌రు. అందుక‌నే యూపీ ప్ర‌భుత్వం ఓ వినూత్న ఆలోచ‌న చేసింది. ఇక‌పై ఆ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాల‌యాల్లో ఉద్యోగుల‌కు, అధికారుల‌కు గ్లాసులో స‌గం నీటినే పోసి ఇస్తారు. దీని వ‌ల్ల ఎంతో నీటిని ఆదా చేయ‌వ‌చ్చ‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం చెబుతోంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్లో నీటి పొదుపుపై మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఓ వినూత్న నిర్ణ‌యం తీసుకుంది. నీటిని పొదుపు చేయాల‌ని ఓ వైపు ప్ర‌జ‌ల‌కు చెబుతూనే మ‌రో వైపు యూపీ సెక్ర‌టేరియ‌ట్‌లోని స‌మావేశాల‌కు ఇక‌పై సగం నీటితో ఉన్న గ్లాసుల‌నే పెట్ట‌మ‌ని ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ స్పీక‌ర్ ఇచ్చిన తాము ఆదేశాల్ని తాము ఇప్ప‌టికే పాటిస్తున్నామ‌ని అధికారులు చెబుతున్నారు. కాగా ఆయా ప్ర‌భుత్వ శాఖ‌లు ఏర్పాటు చేసే స‌మావేశాల్లో గ్లాసుల నిండా నీటిని పోస్తున్నా.. ఆ నీటిని దాదాపుగా చాలా మంది తాగ‌డం లేద‌ని.. కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే తాగుతున్నార‌ని.. అందుకుని నీరు బాగా వృథా అవుతున్నందునే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని యూపీ ప్ర‌భుత్వం చెబుతోంది.

అయితే యూపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఈ నిర్ణ‌యాన్ని అంద‌రూ అభినందిస్తున్నారు. నీటిని పొదుపు చేయాల‌ని యూపీ ప్ర‌భుత్వం ఇలాంటి కార్య‌క్ర‌మం అమ‌లు చేస్తుండడం శుభ ప‌రిణామ‌మ‌ని అంటున్నారు. నీటి పొదుపుపై ప్ర‌జ‌ల్లో మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించేలా ప్ర‌భుత్వాలు కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాల‌ని ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు. అప్పుడే భ‌విష్య‌త్ త‌రాల‌కు స‌హ‌జ వ‌న‌రుల స‌మ‌స్య‌లు లేకుండా ఉంటాయ‌ని వారంటున్నారు. ఏది ఏమైనా.. యూపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఈ నిర్ణ‌యం మాత్రం కొంత వ‌ర‌కు స‌త్ఫ‌లితాల‌నిచ్చే అవ‌కాశం ఉంది..!

Read more RELATED
Recommended to you

Latest news