దివ్యాంగుల కోసం కుంభమేళాలో 100 బెడ్ క్యాంపులు ఉచితంగా…!

-

కుంభమేళా… ప్రయాగ్ రాజ్ లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని పవిత్ర స్నానం చేశారు. అది ఒక మతానికి సంబంధించిన ఉత్సవమే కాదు.. అంతకుమించి. విభిన్నమైన సంస్కృతి, సంప్రదాయాల కలయిక అది. కుంభమేళాలో జరిగే ప్రతి ఒక్కటి రికార్డే. తాత్కాలిక టెంట్ సిటీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అక్కడ విభిన్నమే. అక్కడికి వెళ్లే భక్తులను టెంట్ సిటీ, టాయిలెట్ రెస్టారెంట్లు ఆకర్షిస్తున్నాయి.

ఈ సందర్భంగా.. నారాయన్ సేవా సంస్థాన్ అనే ఎన్జీవో కుంభమేళాకు వచ్చే దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన ఆసుపత్రిని నిర్మించింది. 100 పడకల ఆసుపత్రిని నిర్మించారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన ఈ ఎన్జీవో.. కుంభమేళాకు వచ్చే దివ్యాంగులకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే.. ఆ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స చేస్తారు. సెక్టార్ 14 లో ఈ ఆసుపత్రిని నిర్మించారు. ఉచితంగా ట్రీట్ మెంట్ తో పాటు… ఆహారం కూడా అందిస్తారు. యోగా, ఇతర కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసుకునే విధంగా అక్కడి ఆసుపత్రిని వాళ్లు నిర్మించారు.

జనవరి 7న ప్రారంభమైన ఈ ఆసుపత్రి… ఫిబ్రవరి 20 వరకు కుంభమేళాలో సేవలు అందించనుంది. పెద్ద పెద్ద డాక్టర్లు, సర్జన్లు, మెడిసిన్స్, ఎమర్జెన్సీ సర్వీసులన్నీ ఆ ఆసుపత్రిలో లభ్యమవుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version