అప్పుడు బీటెక్ డ్రాప్ అవుట్.. ఇప్పుడు బిజినెస్ మ్యాన్.. సంవత్సరంనరలో 8 కోట్ల టర్నోవర్..!

1240

ఫెయిల్యూర్ స్టోరీల నుంచే సక్సెస్ ను వెతుక్కోవాలి. సక్సెస్ స్టోరీల నుంచి మీరు ఏం నేర్చుకోలేరు.. అంటూ చెబుతున్నారు మణికంఠ. ఈయన బీటెక్ డ్రాప్ అవుట్. కానీ.. ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్.

మనిషి పుట్టుక చావు మధ్యలోనే జీవితం. పుట్టుక ఎప్పుడు వస్తుందో తెలియదు.. చావు ఎప్పుడొస్తుందో తెలియదు. కానీ.. మధ్యలో జీవితం మాత్రం మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది. మన ఆలోచనలే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని శాసిస్తాయి. మన జీవితాన్ని నడిపిస్తాయి.. అందుకే.. మీరు చదువుకున్నా.. చదువుకోకపోయినా… డబ్బులు ఉన్నా.. లేకున్నా.. మీరు చేయాల్సింది ఒకటే. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. అదే మీకు సరైన గుర్తింపునిస్తుంది.

ఫెయిల్యూర్ స్టోరీల నుంచే సక్సెస్ ను వెతుక్కోవాలి. సక్సెస్ స్టోరీల నుంచి మీరు ఏం నేర్చుకోలేరు.. అంటూ చెబుతున్నారు మణికంఠ. ఈయన బీటెక్ డ్రాప్ అవుట్. కానీ.. ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్. బీటెక్ లో డ్రాప్ అవుట్ అయి.. ఓ డిజిటల్ వాలెట్ ను ప్రారంభించి సంవత్సరంనరలో 8 కోట్ల టర్నోవర్ సాధించాడు. అది ఎలా సాధ్యమైంది. ప్రస్తుతం తను సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వడమే కాదు.. పది మందికి ఉపాధి కల్పిస్తూ.. సస్పెండ్ అయిన కాలేజీకే గెస్ట్ లెక్చరర్ గా వెళ్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మణికంఠ సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం పదండి.

అటెండెన్స్ తక్కువగా ఉందని కాలేజీ నుంచే సస్పెండ్ చేశారు మణికంఠను. తర్వాత కాలేజీ ముఖమే చూడలేదు. కానీ.. తన ఐడియాను ఆచరణలో పెట్టాడు. తను ఇంటర్న్ షిప్ చేసిన రష్యా కంపెనీ సహాయంతో పే ఫిక్స్ అనే డిజిటల్ వాలెట్ ను ఏర్పాటు చేశారు. ఏడుగురు టీం మెంబర్స్ తో సంవత్సరంనరలోనే 8 కోట్లకు పైనే టర్నోవర్ సాధించాడు.

అలా.. అంచెలంచెలుగా ఎదిగి… తర్వాత షాప్ టాప్ కంపెనీ పెట్టి.. ఆ తర్వాత కార్పొరేట్ గిఫ్ట్స్ వ్యాపారం నిర్వహిస్తూ పది మందికి ఉపాధి కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు మణికంఠ.

మణికంఠ పుట్టింది సిల్వర్ స్పూన్ తోనే . కానీ.. తర్వత తన తండ్రి, తల్లి విడిపోవడంతో.. కటిక పేదరికాన్ని అనుభవించాల్సి వచ్చింది. బ్యుటీషియన్ కోర్సు నేర్చుకొని దాని మీద వచ్చిన ఆదాయంతోనే మణికంఠను, అతడి చెల్లిని తన తల్లి చదివించింది. తను ఇప్పుడు ఒక మంచి బిజినెస్ మ్యాన్ కావడానికి ఆదర్శం తన అమ్మే అంటున్నాడు మణికంఠ. బీటెక్ డ్రాప్ అవుట్ అయినా.. చక్కని ప్రణాళికతో కేవలం 40 వేల రూపాయల పెట్టుబడితో.. ఇప్పుడు దేశంలోనే బెస్ట్ బిజినెస్ మ్యాన్ గా నిలిచిన మణికంఠను చూసి నేటి జనరేషన్ యూత్ ఎంతో నేర్చుకోవాలి.

(Video Courtesy: Josh Talks)