ఫుట్ బాల్ ఆడిన ఆవు.. నెట్టింట్లో సందడి చేస్తున్న వీడియో

-

ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్ష బోగ్లే ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫన్నీ వీడియో చూసి నవ్వుకోండి.. అంటూ వీడియోను ఆయన షేర్ చేశారు.

ఓ ఆవు ఫుట్ బాల్ ఆడింది. మైదానంలో ఫుట్ బాల్ ఆడుతూ తెగ సందడి చేసింది. ఆవు ఏంటి ఫుట్ బాల్ ఆడటమేంటనేగా మీ డౌట్. అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే.

ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్ష బోగ్లే ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫన్నీ వీడియో చూసి నవ్వుకోండి.. అంటూ వీడియోను ఆయన షేర్ చేశారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతూ.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

నార్త్ గోవాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఫుట్ బాల్ మైదానంలో ఆటగాళ్లు ఫుట్ బాల్ ఆడుతుండగా… మైదానంలోపలికి వచ్చిన ఆవు.. తన దగ్గరికి వచ్చిన ఫుట్ బాల్ ను వదిలిపెట్టకుండా… ఆటగాళ్లతో కలిసి ఫుట్ బాల్ ఆడింది.

Read more RELATED
Recommended to you

Latest news