స్ఫూర్తి: రెండు కాళ్ళు లేవు.. అయితేనేం పెద్ద మనసు వుంది కదా.. అంటూ ఎందరికో సహాయం..!

-

కొందరు మనకి ఎంతో స్ఫూర్తిని ఇస్తూ ఉంటారు. ఎనర్జీని ఇస్తూ వుంటారు. నిజానికి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా ముందుకు వెళితే కచ్చితంగా సక్సెస్ ని అందుకోగలము జీవితంలో సక్సెస్ ని అందుకోలేక చాలా మంది వెను తిరుగుతూ ఉంటారు అది నిజంగా తప్పు పైగా ఒకటి రెండు అవయవాల వలన వైకల్యం వున్నా కానీ మిగిలిన భాగాలని సమర్ధంగా ఉపయోగించుకుంటే కచ్చితంగా జీవితంలో గెలుపొందొచ్చు.

ప్రతి ఒక్కరికి కూడా ఒకటి కాకపోతే ఇంకొక అవకాశం ఉంటుంది ఇంకొక విధంగా ప్రయత్నం చేయొచ్చు. కొప్పుల వసుంధర నిజానికి చాలా మందికి ఆదర్శంగా నిలిచారు. అనంతపురం జిల్లా వీళ్లది. వసుంధర రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు పోలియో వచ్చింది. రెండు కళ్ళు చచ్చుబడిపోవడంతో కూర్చికే పరిమితమయ్యారు.

ఆమె ఊహ తెలియక ముందే తండ్రి ని కోల్పోయారు. ఆమె తన తల్లి సోదరుడు సహకారంతో చదువుకున్నారు. మాస్ కమ్యూనికేషన్ లో పీజీ చేశారు. ఆ తర్వాత ఆమె హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు. వివిధ ఛానల్స్ లో ప్రోగ్రాం ప్రొడ్యూసర్ గా కంటెంట్ రైటర్ గా పని చేశారు ఆమె.

అయినా సరే ఆమెకి సంతృప్తి కలగలేదు. దివ్యంగుల కోసం ఏమైనా చేయాలని ఆమె అనుకున్నారు. ఉద్యోగం వదిలేసి వి మీడియాస్ అనే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని స్టార్ట్ చేశారు. దివ్యాంగులు రోజు లో చాలా ఇబ్బందులు పడతారు. ఉద్యోగ వ్యాపారల్లో అవకాశాలు వాళ్ళకి ఉండవు. అలానే బయటకు వెళితే మరుగుదొడ్లు లిఫ్టులు వంటివి కూడా వాళ్లకి ఉండవు.

ఇటువంటివి అన్ని ఆమె అనుభవించారు అందుకే వాళ్ళ కోసం ఏమైనా చేయాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. వివిధ ఉపాధి మార్గాలపై దివ్యాంగులకి అవగాహన కల్పించాలని ఆమె నిర్ణయించుకున్నారు. అందుకోసం డి హబ్ ని స్టార్ట్ చేశారు.

ఈమె చాలా రకాల టాపిక్స్ పైన శిక్షణను ఇస్తున్నారు ఆ శిబిరాలకి వచ్చే వాళ్ళకి భోజన వసతి సౌకర్యాలని కూడా ఆమె కల్పిస్తున్నారు రెండు కాళ్ళు లేకపోతే ఏమి అంత పెద్ద మనసు ఉంది కదా..? అది చాలదా..? నిజంగా వసుంధర ని ఆదర్శంగా తీసుకుంటే కచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ముందుకు వెళ్ళగలరు.

Read more RELATED
Recommended to you

Latest news