ప్రపంచంలో అతిపెద్ద భూస్వామి జాన్ మెలోన్..!

-

ప్రపంచంలోనే అతి పెద్ద భూస్వామి అమెరికాకు చెందిన జాన్ మెలోన్. ఈయన మార్చి 7, 1941 న్యూయార్క్ లో జన్మించారు. హాప్కిన్స్ స్కూల్లో ఆయన విద్యాభ్యాసం జరిగింది. అలాగే ఎల్ యూనివర్సిటీ మరియు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ లో కూడా ఈయన చదువుకున్నారు. 1967లో జాన్ హాప్కిన్స్ లో మళ్లీ జాయిన్ అయ్యి పీహెచ్డీ చేశారు.

ఆ తరవాత ఆయన లిబర్టీ మీడియాని స్థాపించారు. మెలోన్‌కు లిబర్టీ గ్లోబల్‌ అనే అంతర్జాతీయ కేబుల్‌ కంపెనీలో 25 శాతం, డిస్కవర్‌ కమ్యూనికేషన్స్‌లో 28 శాతం, అట్లాంటా బ్రేవ్స్‌ అనే బేస్‌ బాల్‌ జట్టులో 8 శాతం షేర్లు ఉన్నాయి.  లిబర్టీ మీడియా అనే ప్రముఖ టీవీ ఛానల్ ఓనర్ అయిన జాన్ నికర సంపాదన విలువ సుమారు 9.22 బిలియన్‌ డాలర్లు.

న్యూ మెక్సికోలోని బెల్‌ రాంచ్‌ను 2,90,100 ఎకరాల వ్యవసాయక్షేత్రం, ఫ్లోరిడాలో 800 ఎకరాల బ్రిడిల్‌వుడ్ ఫామ్స్‌ను కొనుగోలు చెశారు. మేరీల్యాండ్, మైనే, న్యూ హాంప్‌షైర్, కొలరాడో, వ్యోమింగ్‌ వంటి ప్రాంతాల్లో కూడ భూములు ఉన్నాయి.  12లక్షల ఎకరాల భూమిని కొనుగోలు చేసి అమెరికాలో అతిపెద్ద భూస్వామిగా ఎదిగారు. మొత్తం 22లక్షల ఎకరాల భూమి అతని పేరు మీద ఉంది.

ఈయన వయసు 80 ఏళ్లు దాటి పోతున్నప్పటికీ కూడా మీడియా పరంగా కానీ భూముల పరంగా కానీ ఈయనలో ఏ మాత్రం ఎనర్జీ తగ్గడం లేదు. జర్మన్ ఫిలాసఫర్ జార్జ్ హెగెల్ ”ప్రాపర్టీ ఈజీ ది ఫస్ట్ ఎంబోడియెంట్ ఆఫ్ ఫ్రీడమ్” ని ఫాలో అవుతున్నారేమో..

అమెరికాలో అత్యధిక భూమి కలిగిన వారిలో అగ్రస్థానంలో ఉన్నారు మెలోన్. ఈయనకి మొత్తం 22 లక్షల ఎకరాల భూమి ఉంది. దీని విలువ 9.22 బిలియన్ డాలర్లు కావడం నిజంగా గమనార్హం. ఇదిలా ఉంటే తాజాగా మెలోన్ మరియు అతని భార్య 42.5 మిలియన్ డాలర్ల ని కొలరాడో స్టేట్ యూనివర్సిటీ కి ఇచ్చారు. రీజెనరేటివ్ మెడికల్ థెరపిస్ట్స్ ని జంతువులకి మరియు మనుషుల కోసం అభివృద్ధి చేయాలని చెప్పారు. అదేవిధంగా 10 మిలియన్ డాలర్లని ఆపరేషన్స్ కోసం 32.5 మిలియన్ డాలర్లుని ఇన్స్టిట్యూట్ బిల్డింగ్ కోసం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news