స్విగ్గీ డెలివరీ బాయ్ కి లక్ష రూపాయలు రివార్డు ఇచ్చారు. నిజానికి ఆ యువకుడికి… లక్ష రూపాయలు కూడా తక్కువే. ఎందుకంటే ఆ యువకుడు చేసిన సాహసం అటువంటిది. మీకు గుర్తుండే ఉంటుంది… గత సంవత్సరం డిసెంబర్ 17న ముంబైలోని ఈఎస్ఐసీ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం జరిగింది కదా. ఆ ప్రమాదంలో 10 మంది చిక్కుకుపోతే.. స్విగ్గీ ఫుడ్ యాప్ కు చెందిన డెలివరీ బాయ్ సిద్ధ్ రామ్ తన ప్రాణాలకు తెగించి కాపాడాడు.
వాళ్లను కాపాడే క్రమంలో అతడికి గాయాలు కూడా అయ్యాయి. ఏది ఏమైనా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా.. 10 మందిని కాపాడి హీరో అయ్యాడు. సిద్ధ్ రామ్ చేసిన సాహసాన్ని గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం అతడికి రివార్డును ప్రకటించింది. దీంతో మహారాష్ట్ర కార్మిక మంత్రి సంతోశ్ గంగ్వార్ అతడి సాహసానికి గుర్తుగా లక్ష రూపాయల రివార్డును అందించాడు. ఎవరికి ఏమైతే నాకేంటి.. అని అనుకునే లోకం ఉన్న ఈ రోజుల్లో నీ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా… 10 మంది ప్రాణాలు కాపాడిన నీకు హేట్సాఫ్ సిద్ధూ.. హేట్సాఫ్.