మీ సంతోషానికి అడ్డుపడుతున్న విషయాలని అధిగమించండిలా…

-

సంతోషం.. ఏ విధంగానైనా మనకి కలిగే ఒక తృప్తి. ఐతే ఈ కాలంలో సంతోషం అనే మాట కరువైపోయింది. చాలా మంది జీవితాల్లో అది లేకుండా పోయింది. బయటంతా నెగెటివిటీ పరుచుకుని ఉంది. మనం చేసే పనులు కూడా సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఇలాగే కొనసాగితే బ్రతుకు దుర్భరం అవుతుంది. మరి మన సంతోషాల్ని దూరం చేస్తున్న అంశాలేమిటి? అలా దూరం చేస్తున్న వాటిని దూరం చేయడాన్నికి మనం చేయాల్సింది ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాం.

ముందుగా సోషల్ మీడియాని దూరం పెట్టాలి. బయటకి విస్తరించే నెగెటివిటీ మొత్తం సోషల్ మీడియాలోనే ఉంది. ఎక్కువ సేపు సోషల్ మీడియాకి టైమ్ కేటాయించడం వల్ల మనలో కూడా నెగెటివిటీ పెరుగుతుంది. అందుకే సోషల్ మీడియాలో ఎక్కువ సేపు ఉండకపోవడమే మంచిది. ఎంత కాదనుకున్నా ఎక్కువ టైమ్ వేస్ట్ చేసే వాటిల్లో సోషల్ మీడియా మొదటి స్థానంలో ఉంటుంది.

రెండవది తీవ్రమైన ఒత్తిడి: ప్రస్తుతం పనిచేసే స్థలాల్లో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దానివల్ల అనేక శారీరక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. శారీరక సమస్యల వల్ల సంతోషం దూరమవుతుంది. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఒత్తిడి దూరం చేసుకోవాలి. ఒత్తిడి వల్ల పని కూడా సరిగ్గా జరగదు.

ఆవేశాలని బయటకి వెల్లడి చేయాలి. కోపమైనా, బాధైనా, ఆనందమైనా, సంతోషమైనా లోలోపలే అణచివేసుకోవడం సరికాదు. లోపల్లోపల ఎంత నింపేసుకుంటే అంత ఒత్తిడి పెరిగి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది కనబడదు కానీ చాలా ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇంకా సరైన నిద్ర, సరైన వ్యాయామం వంటివి లేకపోతే సంతోషం మన దరికి చేరదు.

Read more RELATED
Recommended to you

Latest news