స్ఫూర్తి: చూపులేని భర్తకి అన్ని తానై…!

నేటి కాలం లో చిన్న చిన్న విషయాలనే పెద్దవి చేసుకుంటూ విడాకులు దాక తెచ్చే దంపతులు ఎక్కువై పోయారు. కానీ అలాంటిది కళ్ళు లేని భర్తని ఎంతో ప్రేమగా అన్ని తానై కంటికి రెప్పలా చూసుకుంటోంది ఈ ఇల్లాలు. నిజంగా ఎంత గొప్ప మహిళా ఓ కదా ఈమె..! మరి అటువంటి గొప్ప మహిళ జీవితం లో పలు విషయాలు మీ కోసం.

inspiring
inspiring

ఈమె చిన్న వయస్సు లోనే చూపు లేని అతనిని పెళ్లి చేసుకుంది. అతనే అబ్రహం. ఇంత గొప్ప హృదయం ఉన్న ఆమె పింప్లి. ఈమె తన భర్తని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. చూపు లేని అబ్రహం ని పెళ్లి చేసుకుని జీవితాంతం సపర్యలు చేస్తోంది ఈ పింప్లి. ఈ దంపతులు ఖమ్మంకు చెందిన వాళ్ళు.

వీళ్ళు ఊర్లోను , చుట్టు పక్కల గ్రామాల్లో వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించే వారు. ఇప్పుడు పనులు దొరకక పోవడం తో సంక్రాంతి, క్రిస్మస్‌ పండుగలకు దుస్తులు పంచుతారని తెలిసి విజయవాడ వచ్చారు. ఏది ఏమైనా గమ్య స్థానాన్ని చేర్చే చుక్కానిగా మారిన ఈమెని అభినందించాలి.