ఆమె పోలీసు అయినా ఓ తల్లే.. అందుకే అనాథ పాపకు పాలుపట్టి ‘అమ్మ’నిపించుకుంది..!

-

అమ్మ.. రెండక్షరాలే. కానీ.. అమ్మ గురించి వర్ణించలేం. అమ్మ అని పిలిచినా చాలు మన జన్మ ధన్యమైపోతుంది. కనిపించే దేవుడిమాట దేవుడెరుగు.. కాని.. మన కళ్ల ముందు తిరిగే దేవతనే అమ్మ అని అంటారు. అమ్మకు అంత ప్రాధాన్యత. మరి.. అంతటి ప్రాధాన్యత ఉన్న అమ్మ పాత్రను పోషించడం అంత ఈజీ కాదు. ఈలోకం ఇంకా బతికి ఉందంటే దానికి కారణం అమ్మ. బిడ్డ కడుపులో పడ్డ దగ్గర్నుంచి ఆ బిడ్డ పెరిగి పెద్దయ్యేదాక అమ్మ తోడు కావాల్సిందే. తనను తాను త్యాగం చేసుకొని బిడ్డకు అన్నీ తానై ఏ లోటు రాకుండా చూసుకుంటుంది అమ్మ . మరి.. అటువంటి అమ్మతనం దొరకడమనేది మహిళలు చేసుకున్న పుణ్యం. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. రీసెంట్ గా అర్జెంటీనాలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకున్నది. ఏంటది.. అంటారా? చదవండి మరి..

అర్జెంటీనాలోని బెర్రిసాలో చిన్న పిల్లల ఆసుపత్రి ఉన్నది. ఆ ఆసుపత్రిలో చెకింగ్ కోసం సెలస్టే జాక్వెలిన్ అనే మహిళా పోలీస్ వెళ్లింది. అదే సమయంలో ఓ చిన్నారి గుక్కపెట్టి మరీ ఏడుస్తున్నది. ఆ చిన్నారిని గమనించిన సెలస్టే.. ఎందుకు ఏడుస్తున్నదని ఆసుపత్రి సిబ్బందిని అడిగింది. ఆ చిన్నారికి ఆకలేస్తున్నదని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దీంతో తన ప్రోటోకాల్ ను పక్కన పెట్టి ఏ మాత్రం ఆలోచించకుండా ఆ చిన్నారికి పాలు పట్టింది ఆ పోలీస్. ఇక.. ఈ ఘటనను చూసి షాకవ్వడం అక్కడున్నవారి వంతయింది. ఇక.. ఈ అరుదైన దృశ్యాన్ని ఫోటో తీసిన మాక్రోస్ హెరీడియా అనే మరో పోలీస్ ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version