సింగరేణి ఉద్యోగులకు సీఎం వరాల జల్లు

-

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ లాభాల్లోని 27 శాతం వాటాను సింగరేణి కార్మికులను ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతేడాది 25 శాతం ఇచ్చిన వాటాను  ఈ సారి రెండు శాతం పెంచి 27 శాతం ఇవ్వాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ ను కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్లో ఇళ్లు నిర్మించుకోవడానికి  సింగరేణి కార్మికులు, అధికారులకు, ఇతర ఉద్యోగులకు వడ్డీ లేని పది లక్షల రూపాయల రుణాన్ని అందిస్తామన్నారు. కార్మికులకు వైద్య సదుపాయాలు, రక్షణ సంబంధిత అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఫలాలు క్షేత్ర స్థాయి వరకు చేరాలని అధికారులకు సూచించారు.

 వారిని ఉద్యోగులుగానే పిలవాలి…

సింగరేణి కార్మికులను వర్కర్లు అని పిలవకూడదని..వారిని కూడా ఉద్యోగులుగానే పిలవాలని సీఎం సూచించారు. యాజమాన్యం, కార్మికులు అనే వేర్వేరు భావనలను వదిలిపట్టి అంతా ఒక కుటుంబంమనే అభిప్రాయంతో ఉండాలన్నారు. ఎలాంటి వాతారణ పరిస్థితుల్లోనైనా సరే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేసే వ్యవస్థ సింగరేణికి ఉంది అంటూ పేర్కొన్నారు.

భవిష్యత్లో సింగరేణి ఇసుక, మైనింగ్ ఇతర కార్యకలాపాల్లో పాల్గొనేవిధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మలనాగేశ్వర రావు, ఈటల రాజేందర్, ఎంపీలు కవిత, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version