జీవితం లో ఎంత ఓడిపోయినా నీకంటూ ఓ విలువుంటుందని తెలిపే అద్భుతమైన కథ.

యాభై మంది కుర్చీల్లో కూర్చున్నారు. వారి ముందు ఒక స్పీకరు నిలబడ్డాడు. అతని జేబులో నుండి 20రూపాయల నోటును తీసిన స్పీకర్, దాన్ని ప్రేక్షకులకు చూపిస్తూ, ఈ 20రూపాయల నోటు ఎవరికి కావాలి అని అడిగాడు. దానికి అందరి చేతులు గాల్లోకి లేచాయి. అప్పుడు ఆ 20రూపాయల నోటును మరో చేతిలోకి తీసుకున్న స్పీకర్, డబ్బు మంచిది కాదు. దీనివల్ల చాలా నష్టాలున్నాయి అని చెబుతూ, మరో చేతిలో ఉన్న 20రూపాయల నోటును పిడికిలిలో బిగించాడు. అప్పుడు నోటు ముడతలు ముడతలుగా మారింది.

ఇప్పుడు మళ్ళీ అడిగాడు. ఈ నోటు ఎవరికి కావాలి అని. దానికి కూడా అందరూ కావాలంటూ చేతులు పైకెత్తారు. అప్పుడు, ఆ 20రూపాయల నోటును నేల మీద పారేశాడు. తన బూటుకాలితో బలంగా తన్నాడు. దానిమీద నాట్యం చేసినట్టుగా చేశాడు. అప్పుడు ఆ 20రూపాయల నోటు పాతదానిలా తయారైంది. ఇప్పుడు ఎవరికి కావాలి అన్నాడు. అన్ని చేతులు గాల్లో లేచాయి.

నీ జీవితంలో నువ్వేంత కిందపడినా నీకంటూ వాల్యూ ఇచ్చే మనుషులు ఎప్పుడూ ఉంటారు. నువ్వేన్ని అపజయాలు చవిచూసినా, నీదంటూ సర్వస్వం కోల్పోయినా, నీ దగ్గర ఎవ్వరూ లేకపోయినా, నీకు విలువ ఇచ్చే వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. వాళ్ళ దృష్టిలో నీ విలువ ఎప్పటికీ తగ్గిపోదు. కాబట్టి నిన్ను నువ్వు నాకేమీ రాదని, నాకేమీ చేతకాదని, నేనిలా ఎందుకు ఉన్నానని అనుకోవద్దు. ఇది జీవితం. పుస్తకంలో రాసుకున్న విధంగా ఉండాలని, ఉంటుందని అస్సలు అనుకోకు. ఊహించని మలుపులు వస్తాయి. తట్టుకుని ముందుకు సాగుతూ పోవాలంతే. డేర్ తు డి‌యూ మోటివేషన్ ఆధారంగా.