కలల్ని కాదు, వాస్తవాలని వెంబడించాలంటున్న ప్రముఖ హాలీవుడ్ దర్శకుడ్ క్రిస్టఫర్ నోలన్..

-

మెమెంటో, ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లార్, డంకిర్క్ చిత్రాల దర్శకుడు క్రిస్టఫర్ నోలన్, అద్భుతమైన ప్రేరణాత్మకమైన ప్రసంగాన్ని ఇచ్చారు. ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో ఇచ్చిన ఉపన్యాసంలోని కొన్ని అంశాలు మీకోసం.

ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ దర్శకుల జాబితా చూసుకుంటే, అందులో మొదటి రెండు మూడు స్థానాల్లో ఉండే క్రిస్టఫర్ నోలన్, విశ్వవిద్యాలయ విద్యార్థులకి ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది. చాలా మంది కలల్ని వెంబడించాలని, వాటిని నిజం చేసుకోవాలని చెబుతుంటారు. దానికి కొంచెం విరుద్ధంగా క్రిస్టఫర్ నోలన్ చెప్పిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. కలల్ని వెంబడించడం కాదు, రియాలిటీని వెంబడించాలని చెప్పాడు. వాస్తవాన్ని వెంబడించే క్రమంలోనే మన పనులు సాగాలని అంటున్నాడు. అలా అని కలలు కనకూడదని చెప్పలేదు.

కలల్ని పునాదులుగా చేసుకుని రియాలిటీ వైపు పరుగెత్తాలని సూచించాడు. యూనివర్సిటీ విద్యార్థులు మరికొద్ది రోజుల్లో వాస్తవ ప్రపంచంలోకి రానున్నారు కాబట్టి, బయట ప్రపంచంలో తామెలా ఉండాలనేది చక్కగా చెప్పారు. విశ్వ విద్యాలయంలో తాము నేర్చుకున్న జ్ఞానాన్ని బయటకి అప్లై చేస్తూ మరింత ఆనందంగా జీవించాలంటూ అన్నారు. విశ్వ విద్యాలయంలో మనం ఏం నేర్చుకున్నాం? అది బయట ఎలా వాడుతున్నాం? బయట వాటి ప్రభావం ఎంత? మనం దేన్నైనా ప్రభావితం చేయగలుగుతున్నామా లేదా చూసుకోవాలని చెప్పాడు.

ఇక్కడ నేర్చుకున్న అంశాల ద్వారానే మీ భవిష్యత్తుని చూడగలుగుతారు. మీ జ్ఞానానికి మరికొంత జోడించి బయట ప్రపంచాన్ని చూడాలని, దానివల్ల మీ జీవితంలో మరింత ఆనందం నింపుకోవాలని కోరాడు. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన టెనెట్ సినిమా కరోనా టైమ్ లో విడుదలయిన సంగతి తెలిసిందే. ఇండియాలోనూ ఈ సినిమా విడుదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news