దీపావళికి బోనస్‌లు ఇచ్చే కంపెనీలు ఉన్నాయి.. క్రాకర్స్, స్వీట్స్ కొనుక్కోని కుటుంభీకులతో ఎంజాయ్ చేయమని డబ్బులు పంపించే కంపెనీలు ఉన్నాయి.. కానీ ఏకంగా.. ఉద్యోగులుకు కార్లు ఇచ్చే యజమానిని చూశారా..? ఇక్కడ ఈ యజమాని ఏకంగా ఉద్యోగులకు పండగకు కార్లు గిఫ్ట్‌లుగా ఇచ్చారు. చైన్నైలోని చల్లానీ జువెల్లరీ మార్ట్ యజమాని చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
తమిళనాడు రాజధాని చెన్నైలోని చల్లానీ జువెల్లరీ మార్ట్ సంస్థ యజమాని జయంతి లాల్ ఛాయంతి ఉద్యోగులుక ఊహించని బహుమతి అందించారు. దీపావళి పర్వదినానికి ముందు తన నగల దుకాణంలో పని చేస్తున్న ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్‌లు ఇచ్చి ఆశ్చర్చపరిచారు. తమ సిబ్బందిలోని 8 మందికి కార్లను, 18 మందికి బైక్‌లు అందించారు. వీటి కోసం ఆయన రూ.కోటి 20 లక్షలు ఖర్చు చేశారట. ఈ బహుమతులను సిబ్బందికి అందజేస్తుండగా, వారంతా ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు.
ఉద్యోగుల పని తీరు వల్లే లాభాలు అందుకేనట..
నగల దుకాణంలో పని చేసే ఉద్యోగులు వ్యాపార అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని, వారికి తనకు తోచిన బహుమతులు అందిస్తున్నాని ఈ సందర్భంగా జయంతి లాల్ ఛాయంతి తెలిపారు. ఉద్యోగులు తనకు రెండో కుటుంబం లాంటి వారని.. కష్టాల్లో ఉన్నప్పుడు తోడున్నది మా సిబ్బందే అని జయంతి లాల్ తెలిపారు. ప్రతి ఓనర్ కూడా తమ సిబ్బందికి ఇలాంటి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించాలి” అని జయంతి లాల్ వివరించారు.
సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ….
దీపావళి వేళ తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు బహుమతులు ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓనర్ అంటే ఇలా ఉండాలి. ఇలాంటి వారి కోసం ఉద్యోగస్తులు ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉంటారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
దీపావళికి బోనస్ పడటమే మనం ఆనందంగా భావిస్తాం.. కంపెనీలను బట్టి ఉంటాయి.. సౌత్‌లో చాలా కంపెనీలు దీపావళికి పెద్దగా ఏం స్పెషల్ చేయవు.. దసరాకు బోనస్‌లు ఇస్తాయి. ఇంతకీ మీ కంపెనీ వాళ్లు ఏం చేస్తారు..?