ఆ పదిపైసలు బిళ్ళ ఖరీదు..10 కోట్లు..స్పెషల్ ఏమిటంటే…!!!!

-

మీరు చదివింది నిజమే, కేవలం ఒకే ఒక్క పదిపైసలు బిళ్ళ కోట్ల రూపాయలు పలికింది. పదిపైసలు బిళ్ళ కోట్లు పలకడం ఏమిటి అంటూ ఇంట్లో ఎక్కడో ఉన్న పాత పదిపైసలు బిళ్ళలు వెతికే పని మాత్రం పెట్టుకోకండి. ఆ పదిపైసలు బిళ్లలో ఒక స్పెషాలిటీ ఉంది ఏమిటా స్పెషాలిటీ అంటే. అమెరికాలోని షికాగో లో ఓ వేలం పాట నిర్వహించారు. ఈ వేలంపాటలో  ఎన్నో పురాతన వస్తువులు అందుబాటులో ఉంచారు నిర్వాహకులు.

అక్కడ ఉన్న వస్తువులు అన్నిటిలో అందరూ కేవలం ఒక పదిపైసలు బిళ్ళని దక్కించుకోవాలని ఆరాట పడుతున్నారు. ఎవరికీ వారు పోటీ పడుతున్న సమయంలో ఎక్కడి నుంచీ వచ్చాడో కానీ ఒక పెద్దాయన  అందరికన్నా ఎక్కువ మొత్తంలో పాడి ఆ పదిపైసలు దక్కించుకున్నాడు. ఇంతకీ ఆ పెద్దాయన ఎంత మొత్తం పాట పాడాడో తెలుసా. అక్షరాలా 10 కోట్లు..ఆ వస్తువు ఖరీదు ఎందుకు అంత రేటు పలికిందంటే.

ఆ బిళ్ళ సుమారు 1894 లో ముద్రించారట అంతేకాదు అలాంటి బిళ్ళలు కేవలం 24 మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయని, ఈ నాణేలని డైమ్ అంటారని తెలిపారు నిర్వాహకులు. వీటి వులువ అప్పట్లో చాలా అధికంగా ఉండేదట కేవలం ధవంతుల ఇళ్ళలో మాత్రమే ఈ నాణాలు ఉండేవని అందుకే దీని ధర కోట్లు పలికిందని అంటున్నారు చరిత్ర కారులు.

Read more RELATED
Recommended to you

Latest news